SBI Clerk Recruitment 2021: ఎస్‌బీఐ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారికి అలర్ట్.. దరఖాస్తులకు గడువు పెంపు..
SBI Clerk Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ క్లర్క్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 5237 పోస్టులకు గాను ఎస్‌బీఐ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు..
SBI Clerk Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎస్‌బీఐ క్లర్క్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మొత్తం 5237 పోస్టులకు గాను ఎస్‌బీఐ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులను మే 17లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌బీఐ గతంలో ప్రకటించింది. అయితే తాజాగా ఈ గడువును పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్‌బీఐ క్లర్క్ పోస్టులకు చివరి తేదీగా జూన్ 20ని తాజాగా నిర్ణయించారు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ముఖ్యమైన విషయాలు..
* ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 5237 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు డిగ్రలోఉత్తీర్ణత సాధించి ఉండాలి .
* అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
* డిగ్రీ చివరి ఏడాది చదువుతోన్నవిద్యార్థులు సైతం ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఆన్‌లైన్ పరీక్షలో సాధించిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంచుకుంటారు.
* ఎంపికైనన అభ్యర్థులకు ప్రారంభ వేతనం రూ. 19,900గా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు https://sbi.co.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read: మీడియాపై విరుచుకుపడిన లెజండరీ క్రికెటర్..! ఇండియాకు మద్దతు తెలిపిన ఆస్టేలియా మాజీ ప్లేయర్..
Viral News: పాము ఉందన్న సమాచారంతో టెర్రస్ పైకి వెళ్లిన స్నేక్ క్యాచర్.. మైండ్ బ్లాంక్