CLAT Exam 2021: క‌రోనా ఎఫెక్ట్‌… వాయిదా ప‌డ్డ మ‌రో ప‌రీక్ష‌.. జూన్ 13న జ‌ర‌గాల్సిన క్లాట్ ప‌రీక్ష‌ను..

CLAT Exam 2021: క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌ట్లో భార‌త్‌ను వీడేలా క‌నిపించ‌డంలేదు. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్నట్లుగానే...

CLAT Exam 2021: క‌రోనా ఎఫెక్ట్‌... వాయిదా ప‌డ్డ మ‌రో ప‌రీక్ష‌.. జూన్ 13న జ‌ర‌గాల్సిన క్లాట్ ప‌రీక్ష‌ను..
Clat Exam 2021
Follow us
Narender Vaitla

|

Updated on: May 16, 2021 | 12:01 PM

CLAT Exam 2021: క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్ప‌ట్లో భార‌త్‌ను వీడేలా క‌నిపించ‌డంలేదు. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్నట్లుగానే విద్యా రంగంపై కూడా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. దేశ వ్యాప్తంగా అన్ని ర‌కాల ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయ‌డ‌మో లేక ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంటున్నారు. ఈక్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు జాతీయ స్థాయితో పాటు రాష్ట్ర స్థాయిలోనూ ప‌లు పోటీ ప‌రీక్ష‌లు సైతం వాయిదా ప‌డ్డాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో ప్ర‌వేశ ప‌రీక్ష వాయిదా ప‌డింది. హైద‌రాబాద్‌లోని న‌ల్సార్ యూనివ‌ర్సిటీతో పాటు దేశ‌వ్యాప్తంగా ఉన్న న్యాయ విశ్వ‌విద్యాల‌యాల్లో ప్ర‌వేశాల‌కు ఉద్దేశించిన క్లాట్‌-2021 ప‌రీక్ష‌ను వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. నిజానికి ఈ పరీక్ష‌ను జూన్ 13న నిర్వ‌హించాల్సి ఉంది. అయితే దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతుండ‌డంతో వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన త‌దుప‌రి తేదీల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొన్నారు. ఇక ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీని సైతం పొడ‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అభ్య‌ర్థులు జూన్ 15 వ‌ర‌కు పొడ‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Also Read: Oxygen Concentrators: ఇంట్లోనే ఆక్సిజన్ అందించే కాన్సన్‌ట్రేటర్స్.. వాటిని ఎలా వాడాలి.. వివరంగా ఇక్కడ తెలుసుకోండి

ఇజ్రాయెల్, గాజాలో హింసపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తీవ్ర ఆందోళన, బెంజమిన్ నెతన్యాహు, అబ్బాస్ లకు ఫోన్లు, శాంతియుత ఒప్పందానికి రావాలని సూచన

Rarest Fish: ఈ చేప ధ‌ర బంగారంతో స‌మానం.. దాని కూర చేయ‌డం నేర్చుకోడానికి ఒక జీవితం స‌రిపోద‌ట‌