TS PECET 2021: టీఎస్‌పీఈసెట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. అప్లిపకేషన్‌ల గడువు పెంపు..
TS PECET 2021: కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతోన్న దృష్ట్యా దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇక ఇప్పటికే టెన్త్, ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలను కొన్నిరాష్ట్రాలు....
TS PECET 2021: కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతోన్న దృష్ట్యా దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇక ఇప్పటికే టెన్త్, ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలను కొన్నిరాష్ట్రాలు రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ప్రభావం పోటీ పరీక్షలపై కూడా స్పష్టంగా పడింది. దేశంలోని చాలా పోటీ పరీక్షలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. ఇందులో భాగంగానే అప్లికేషన్‌ల తేదీని పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తెలంగాణలోని వ్యాయామ విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్) దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. నిజానికి దరఖాస్తుల చివరి తేదీని ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేశారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం మే 8న దరఖాస్తు గడువు ముగిసింది. అయితే కరోనా నేపథ్యంలో దానిని 15కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఈ తేదీని మరోసారి మే 22కు పొడగించారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 22 వరకు అప్లికేషన్‌లను స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోని వారు https://pecet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400, ఇతరులు రూ .800 చెల్లించాల్సి ఉంటుంది.