NEET-UG 2024 Row: ‘అలా చేస్తే పరీక్ష ప్రతిష్ట దెబ్బతింటుంది’.. నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్‌పై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జూన్ 4న నీట్ యూజీ 2024 ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో దాదాపు 67 మంది విద్యార్ధులకు టాప్ ర్యాంకు వచ్చింది. వీరందరికీ 99.997129 పర్సంటెల్ వచ్చింది. ఎంతో కఠినమైన నీట్ పరీక్షలో ఇంత మందికి ఒకే పర్సెంటైల్ రావడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో నీట్ యూజీ-2024 పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి..
న్యూఢిల్లీ, జూన్ 12: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జూన్ 4న నీట్ యూజీ 2024 ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో దాదాపు 67 మంది విద్యార్ధులకు టాప్ ర్యాంకు వచ్చింది. వీరందరికీ 99.997129 పర్సంటెల్ వచ్చింది. ఎంతో కఠినమైన నీట్ పరీక్షలో ఇంత మందికి ఒకే పర్సెంటైల్ రావడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో నీట్ యూజీ-2024 పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే నీట్ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలంటూ గత కొన్ని రోజులుగా నివరసనలు వెళ్లువెత్తుతున్నాయి.
దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. దీనిపై జూన్ 11న విచారణ జరిపిన జస్టిన్ విక్రమ్ నాథ్, జస్టిస్ అమనుల్లాతో కూడిన వెకేషన్ బెంచ్ నీట్ పరీక్షను క్యాన్సిల్ చేయడం అంత సులువు కాదని, ఇలా చేస్తే నీట్ పరీక్ష ప్రతిష్ట దెబ్బతింటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ ఆరోపణలపై వివరణ కోరుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. అలాగే నీట్ కౌన్సిలింగ్ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీనిపై తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం.. ఆలోగా ఎన్‌టీఏ తమ సమాధానం తెలియజేయాలని కోర్టు ఆదేశించింది.
కాగా ఈ ఏడాది మే 5వ తేదీన నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలు జూన్ 4న విడుదలయ్యాయి. తొలుత జూన్ 14న ఫలితాలు వెల్లడిస్తామని చెప్పిన ఎన్టీయే.. అంతకంటే ముందుగానే ఓట్ల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న సమయంలో సరిగ్గా అదే రోజు హడావిడిగా నీట్ యూజీ ఫలితాలు విడుదల చేయడం వివాదానికి దారితీసింది. పైగా ఈ ఫలితాల్లో 67 మందికి ఆలిండియా మొదటి ర్యాంక్ రావడం, వారిలో ఆరుగురు ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన వారై ఉండటం వివాదానికి తెరతీసింది. దీంతో ఈ పరీక్షలో పేపర్ లీకేజీ జరిగిందని ఆరోపణలు వెళ్లువెత్తాయి. ఈ రగడ సుప్రీకోర్టు వరకు వెళ్లడంతో ఎన్టీయేను కోర్టు వివరణ కోరుతూ ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.