AP EAPCET 2024 Results: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్‌ చేసుకోండి..

AP EAMCET rank, scorecard: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి.. ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, ఇంటర్మీడియట్‌ వెయిటేజీ మార్కులు రెండింటి ఆధారంగా తుది ర్యాంకులు ప్రకటిస్తారు.

AP EAPCET 2024 Results: విద్యార్థులకు అలర్ట్.. ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ చెక్‌ చేసుకోండి..
Ap Eapcet 2024
Follow us
Shaik Madar Saheb

| Edited By: Srilakshmi C

Updated on: Jun 12, 2024 | 7:43 AM

ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్‌ 2024 ఫలితాలు విడుదల అయ్యాయి.. ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలను ఏపీ ఈఏపీసెట్‌ సెట్‌ ఛైర్మన్, జేఎన్‌టీయూ-కాకినాడ వీసీ ప్రసాదరాజు, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ రామమోహన్‌రావు సంయుక్తంగా విడుదల చేశారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌ను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించగా.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడలో విడుదల చేశారు. ఫలితాలను అధికారిక వెబ్ సైట్ cets.apsche.ap.gov.in లో చెక్ చేసుకోవచ్చు..

ఫలితాలను డైరెక్ట్ గా చెక్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

ఇలా చెక్ చేసుకోండి..

  • అధికారిక వెబ్ సైట్ cets.apsche.ap.gov.in లో లాగిన్ అవ్వండి..
  • AP EAPCET 2024 పై క్లిక్ చేయండి..
  • అనంతరం ఫలితాలపై క్లిక్ చేసి.. మీ వివరాలను రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ ను నమోదు చేయండి..
  • ఫలితాన్ని చూసుకున్న తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం ర్యాంకు కార్డు డౌన్‌లోడ్ చేసుకోండి..

పరీక్షా ఫలితాలు ఇలా..

ఇంజినీరింగ్ కోసం 2,74,213 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,58,374 మంది హాజరయ్యారు. వారిలో 1,95092 మంది క్వాలిఫై అయ్యారు. ఉత్తీర్ణత శాతం.. 75.51..

అగ్రికల్చర్ పరీక్ష కోసం 88638 మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 80,766 మంది హాజరయ్యారు. వారిలో 70,352 మంది క్వాలిఫై కాగా.. ఉత్తీర్ణత శాతం 87.11..

ర్యాంకులు ఇలా..

ఇంజనీరింగ్‌లో ఫస్ట్ ర్యాంక్ – మాకినేని జిష్ణు సాయి సాధించగా.. రెండవ ర్యాంకు మురసాని సాయి యశ్వంత్ రెడ్డి, మూడో ర్యాంకు భోగలాపల్లి సందీప్‌ సాధించారు.

అగ్రికల్చర్‌లో ఫస్ట్ ర్యాంక్ యెల్లు శ్రీశాంత్ రెడ్డి(తెలంగాణ), రెండవ ర్యాంక్ పూల దివ్యతేజ, మూడవ ర్యాంక్ వడ్లపూడి ముకేష్ చౌదరి సాధించారు.

ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్‌ మార్కులకు 25% వెయిటేజీ ఉంటుంది. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, ఇంటర్మీడియట్‌ వెయిటేజీ 25 శాతం మార్కులు రెండింటి ఆధారంగా తుది ర్యాంకులు ప్రకటిస్తారు.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా మే 16 నుంచి 23 వరకు ఈఏపీసెట్‌ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 3,62,851 మంది విద్యార్ధులు ఈఏపీసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,39,139 మంది పరీక్ష రాశారు.. వీరిలో ఇంజినీరింగ్‌కు సంబంధించి 2,58,373 మంది, వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు సంబంధించి 80,766 మంది పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..