AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB NTPC 2025 Exam Dates: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రైల్వే పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే!

గతేడాది దాదాపు 11,558 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దేశ వ్యాప్తంగా దాదాపు 1.2 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో గతేడాది నుంచి పరీక్ష తేదీల కోసం నిరుద్యోగులు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా..

RRB NTPC 2025 Exam Dates: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ రైల్వే పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే!
RRB NTPC 2025 Exam Dates
Srilakshmi C
|

Updated on: May 28, 2025 | 10:57 AM

Share

అమరావతి, మే 14: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజిన్లలో దాదాపు 11,558 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) పోస్టుల భర్తీకి గతేడాది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB).. ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు గతేడాదే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా ముగిసింది. అయితే సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఆర్‌ఆర్‌బీ తాజాగా ఈ పోస్టులకు రాత పరీక్ష తేదీలను ప్రకటించింది. మొత్తం పోస్టుల్లో గ్రాడ్యుయేట్ స్థాయికి 8,113 ఉద్యోగాలు, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి 3,445 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిల్లో గ్రాడ్యుయేట్ స్థాయికి సంబంధించి 8,113 రైల్వే ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్‌ పోస్టుల పరీక్షల తేదీలను మాత్రమే వెల్లడించింది.

తాజా ప్రకటన మేరకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు జూన్‌ 5వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్నాయి. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో ఈ 8,113 ఖాళీలను భర్తీ చేయనుంది. దీని ద్వారా వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలకు సంబంధించి గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలోని పోస్టులు ఇవే..

  • చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ – 1736 ఖాళీలు
  • స్టేషన్ మాస్టర్ – 994 ఖాళీలు
  • గూడ్స్ ట్రైన్ మేనేజర్ – 3144 ఖాళీలు
  • జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ – 1507 ఖాళీలు
  • సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 732 ఖాళీలు

మొత్తం 11,558 ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పోస్టులకు గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు దేశ వ్యాప్తంగా అక్షరాల 1.2 కోట్ల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఇన్ని కోట్ల మందికి దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష జరగనుంది. ప్రతిరోజూ మూడు షిఫ్టులలో జరుగుతుంది. షిఫ్ట్ 1 ఉదయం 9 నుంచి 10.30 వరకు, షిఫ్ట్ 2 మధ్యాహ్నం 12.45 నుంచి 2.15 గంటల వరకు, షిఫ్ట్ 3 సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు నిర్వహిస్తారు. CBT 1 పరీక్ష 90 నిమిషాల వ్యవధిలో 100 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు జరుగుతుంది. ఈ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానాలకు మూడవ వంతు మార్కును తగ్గిస్తారు. సరైన సమాధానాలకు మార్కు కేటాయిస్తారు. జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 ప్రశ్నలు, మ్యాథమెటిక్స్ నుంచి 30 ప్రశ్నలు, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ విభాగాల నుంచి 30 ప్రశ్నలు వస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్