RRB ALP Exam Date: సికింద్రాబాద్‌ రైల్వేలో 2,528 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులు.. పరీక్ష తేదీలు ఇవే

రైల్వేలో అసిస్టెంట్‌ లోకో పైలట్‌ నియామక రాత పరీక్ష సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను రైల్వే శాఖ విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పును డౌన్ లోడ్ చేసుకోవచ్చు..

RRB ALP Exam Date: సికింద్రాబాద్‌ రైల్వేలో 2,528 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులు.. పరీక్ష తేదీలు ఇవే
RRB ALP Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 22, 2024 | 1:53 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 18: రైల్వే ఉద్యోగాలకు సీరియస్‌గా ప్రిపేరవుతున్న అభ్యర్ధులకు రైల్వే శాఖ మరో అప్‌డేట్‌ విడుదల చేసింది. అసిస్టెంట్‌ లోకో పైలట్‌ నియామక రాత పరీక్ష సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను రైల్వే శాఖ ఇటీవల విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, యూజర్‌ పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి తమ పరీక్ష కేంద్రం వివరాలను ( సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పు) డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ స్లిప్పులో పరీక్ష కేంద్రం, సిటీ, పరీక్ష తేదీ, సమయం, మార్గదర్శకాలు వంటి తదితర వివరాలు ఉంటాయి. ఇక త్వరలో నే అడ్మిట్‌ కార్డులు కూడా విడుదల కానున్నాయి.

కాగా దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో మొత్తం 18,799 అసిస్టెంట్‌ లోకో పైలట్‌ కొలువులకు ఈ ఏడాది జనవరిలో ఆర్‌ఆర్‌బీ ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో సికింద్రాబాద్‌ రైల్వే జోన్‌లో 2,528 వరకు ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన నియామక రాత పరీక్ష నవంబర్‌ 25, 26, 27, 28, 29 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. సీబీటీ 1, సెకండ్‌ సీబీటీ 2, కంప్యూటర్‌ బేస్డ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.

రేల్వే ఏఎల్‌పీ ఎగ్జామ్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఫార్మసిస్టుల శిక్షణ నమోదుకు దరఖాస్తులు ఆహ్వానం.. డిసెంబరు 5 వరకు ఛాన్స్

ఢిల్లీకి చెందిన ‘లైఫ్‌ సైన్సెస్‌ సెక్టార్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌’ ఫార్మసిస్టులకు అందించే శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన వారు డిసెంబరు 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ శిక్షణ 4 రోజుల పాటు జరుగుతుందని తెలిపింది. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపింది. భవిష్యత్తులో తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌ ప్రత్యేకంగా ఫార్మసిస్టులకు శిక్షణ ఇస్తుందని వెల్లడించింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే