Prasar Bharati Recruitment 2022: ప్రసార భారతిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ అర్హతలుంటే జాబ్ గ్యారెంటీ..
భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ప్రసార భారతి (Prasar Bharati New Delhi).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ఏవీ ఎడిటర్ (Assistant AV Edictor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన..
Prasar Bharati New Delhi Assistant AV Edictor Recruitment 2022: భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ప్రసార భారతి (Prasar Bharati New Delhi).. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ఏవీ ఎడిటర్ (Assistant AV Edictor Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 25
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఏవీ ఎడిటర్ పోస్టులు
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 50 ఏళ్లకు మించరాదు.
వ్యవధి: రెండేళ్లు
పే స్కేల్: నెలకు రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సౌండ్/వీడియో ఎడిటింగ్‌లో డిగ్రీ/డిప్లొమా/ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఆడియో/వీడియో ఎడిటింగ్ పనిలో అనుభవం లేదా నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం ఉండాలి. టెక్నికల్ నైపుణ్యాలుండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి (జులై 21, 2022).
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.