Telangana: ఉస్మానియా, జెఎన్టీయూ పరిధిలో ఆన్‌లైన్ క్లాసులు.. ఎప్పటివరకంటే..?
Online Classes: కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా.. తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం
Online Classes: కరోనా మహమ్మారి తీవ్రత దృష్ట్యా.. తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల (జనవరి) 30 వరకు సెలవుల్ని పొడిగించినట్లు తెలంగాణ చీఫ్‌సెక్రటరీ ఆదివారం ప్రకటించారు. కరోనా నేపథ్యంలోనే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయ ఈ మేరకు శనివారం ఉత్తర్వులు (జీవో ఆర్టీ 4,తేదీ 16.01.2022) జారీ చేశారు. అయితే.. మెడికల్ కళాశాలలకు మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. ప్రభుత్వం సెలవులను పొడగించిన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ, జెఎన్‌టీయూ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో రేపటినుంచి ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని ఓయూ నిర్ణయించింది. ఈ నెల 30 వరకు ఓయూ పరిధిలోని అన్ని తరగతులు ఆన్‌లైన్‌లో కొనసాగుతాయని, డిగ్రీ, పీజీ విద్యార్థులు గమనించాలని పేర్కొంది. దీంతోపాటు జేఎన్టీయూ యూనివర్సిటీ కూడా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 30వరకు ఆన్లైన్లో క్లాసులు జరుగుతాయని వెల్లడించింది. ఈ ఆన్‌లైన్ క్లాసులు రేపటి నుంచి కొనసాగుతాయని ఇరు యూనివర్సిటీలు తెలిపాయి.
Also Read: