ONGC Recruitment: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

ONGC Recruitment 2021: ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు...

ONGC Recruitment: ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 28, 2021 | 7:51 AM

ONGC Recruitment 2021: ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటీవ్‌ (15), పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ (06) ఖాళీలు ఉన్నాయి.

* హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటీవ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పర్సనల్ మేనేజ్మెంట్/హెఆర్డీ/హెచ్ ఆర్ ఏమ్ తదితర విభాగాల్లో ఎంబీఏలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* పబ్లిక్‌ రిలేషన్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పబ్లిక్ రిలేషన్స్/జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్‌లో 60 శాతం మార్కులతో పీజీ పూర్తి చేసిఉండాలి. అభ్యర్థులు తప్పనిసరిగా UGC NET-June 2020 అర్హత సాధించాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ. 300 అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించాలి.

* EWS, OBC కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

* పూర్తి వివరాల కోసం ఓఎన్‌జీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Also Read: New Year 2022: కొత్త సంవత్సరంలో ఈ వాస్తు టిప్స్ పాటిస్తే.. ఏడాది పొడవునా ఇంట్లో ఆనందాలే..!

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. ప్రధాన నగరాల్లో సిల్వర్‌ ధరలు ఎలా ఉన్నాయంటే..?

తాళికట్టు శుభవేళ ఆగలేని వరుడు !! మంత్రాలు చదువుతూ స్టెప్స్‌ వేసిన పంతులు!! వీడియో