New Year 2022: కొత్త సంవత్సరంలో ఈ వాస్తు టిప్స్ పాటిస్తే.. ఏడాది పొడవునా ఇంట్లో ఆనందాలే..!
ఇంట్లో ఉత్తర దిశ సంపదకు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. చిరిగిన బట్టలు, చెత్త, పలిగిన ఎలక్ట్రానిక్స్ ఈ దిశలో..
Vastu Tips For New Year 2022: ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించాలని కోరుకుంటారు. సంవత్సరంలోని తొలిరోజు బాగుంటే ఆ సంవత్సరం అంతా బాగానే గడుస్తుందని నమ్ముతుంటారు. అందుకే 2022వ సంవత్సరం మొదటి రోజున ఇంటి ప్రధాన ద్వారంపై స్వస్తిక్ రాశిని రాయాలని చూచిస్తుంటారు. దీని వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందని చెబుతున్నారు.
ఇంటి ఉత్తర దిక్కు సంపదకు దేవుడు అయిన కుబేరునికి ఆస్థానంగా చెబుతుంటారు. అందువల్ల, వాస్తు ప్రకారం, ఈ దిశలో ప్రత్యేక శ్రద్ధ ఉంచాల్సిన అవసరం ఉంది. ఉత్తర దిశలో కుబేరుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎప్పటికీ రావని అంటుంటారు.
ఇంట్లో ఉత్తర దిశ సంపదకు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. చిరిగిన బట్టలు, చెత్త, పలిగిన ఎలక్ట్రానిక్స్ ఈ దిశలో ఎప్పుడూ ఉంచకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు.
వాస్తు ప్రకారం, ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహానికి ఇంటి తూర్పు దిశలో మొక్కలను నాటాలి. నూతన సంవత్సరం రోజున మొక్కలకు నీరు పోస్తే ఇంట్లోకి ధనం వచ్చే అవకాశం ఉందంట. కుటుంబ సభ్యుల మధ్య సోదరభావం కూడా కొనసాగుతుందంట.
నూతన సంవత్సరాది రోజు సాయంత్రం పూజలు చేసి ఇంట్లో గంగాజలం చల్లితే అంతా మంచి జరుగుతుందని అంటున్నారు. ఈ రోజున పూజగదిలో శంఖాన్ని తప్పనిసరిగా ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని నమ్మకంగా చెబుతున్నారు.
Also Read: జాతకంలో శుక్రుడు బలంగా లేకుంటే డబ్బుకు లోటు..! ఇలా చేస్తే శుభ పరిణామాలు