NFC: హైద‌రాబాద్ న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌లో అప్రెంటిస్ ఖాళీలు.. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక‌.. నేడే చివ‌రి తేదీ..

NFC Hyderabad Recruitment: హ‌ఐహైద‌రాబాద్‌లోని న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌(ఎన్‌ఎఫ్‌సీ).. ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భార‌త ప్ర‌భుత్వ అణుశ‌క్తి విభాగానికి చెందిన ఈ సంస్థ‌లో...

NFC: హైద‌రాబాద్ న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌లో అప్రెంటిస్ ఖాళీలు.. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక‌.. నేడే చివ‌రి తేదీ..
Nfc Hyderabad
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 04, 2021 | 8:15 AM

NFC Hyderabad Recruitment: హ‌ఐహైద‌రాబాద్‌లోని న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌(ఎన్‌ఎఫ్‌సీ).. ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. భార‌త ప్ర‌భుత్వ అణుశ‌క్తి విభాగానికి చెందిన ఈ సంస్థ‌లో వివిధ ట్రేడుల్లో ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలను భ‌ర్తీ చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా.. అటెండెంట్, ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, మెషినిస్ట్, టర్నర్, కార్పెంటర్, కోపా, స్టెనోగ్రాఫర్, మెకానిక్‌ డీజిల్, ప్లంబర్, వెల్డర్ విభాగాల్లో ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.

* 2018, 2019, 2020లో విద్యార్హత పూర్తి చేసుకున్న వారు మాత్రమే వీటికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హులు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఎంపికైన అభ్యర్థుల‌కు అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా వివిధ ట్రేడుల ఆధారంగా నెలకు రూ.8,050, నెలకు రూ.7,700 చెల్లిస్తారు.

* ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులకు మెయిల్‌ ద్వారా సమాచారం అందిస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌ నేటితో (శుక్ర‌వారం) ముగియ‌నుంది. (05-06-2021)

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి.

Also Read: TS EAMCET 2021: టీఎస్ ఎంసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..?

Teachers Eligibility Test: ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్… టెట్ సర్టిఫికెట్ గడువు పెంపు..

NBT Jobs: నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం