AP NEET Counselling 2024: నీట్ అభ్యర్ధులకు అలర్ట్.. యాజమాన్య కోటా ప్రవేశాలకు నేటితో ముగుస్తున్న రిజిస్ట్రేషన్‌ గడువు

ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రా, ఎస్వీ యూనివర్సిటీల పరిధిలోని మెడికల్, డెంటల్‌ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి విజయవాడ డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే నీట్‌ యూజీ-2024 కటాఫ్‌ మార్కులతోపాటు రాష్ట్ర ర్యాంకులు కూడా విడుదలయ్యాయి. యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ప్రవేశాల..

AP NEET Counselling 2024: నీట్ అభ్యర్ధులకు అలర్ట్.. యాజమాన్య కోటా ప్రవేశాలకు నేటితో ముగుస్తున్న రిజిస్ట్రేషన్‌ గడువు
AP NEET Counselling
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 16, 2024 | 8:46 AM

అమరావతి, ఆగస్టు 16: ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రా, ఎస్వీ యూనివర్సిటీల పరిధిలోని మెడికల్, డెంటల్‌ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి విజయవాడ డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య యూనివర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటికే నీట్‌ యూజీ-2024 కటాఫ్‌ మార్కులతోపాటు రాష్ట్ర ర్యాంకులు కూడా విడుదలయ్యాయి. యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ప్రవేశాల దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేయడానికి ఆగస్టు 16న రాత్రి 9 గంటల వరకు అవకాశం ఉంటుంది. సంబంధిత పత్రాలు ఆగస్టు 21వ తేదీ రాత్రి 9 గంటల వరకు అప్‌లోడ్‌ చేసేందుకు గడువు నిర్ణయించారు. రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ (ఎన్నారై ‘సి’ కేటగిరీ)తో పాటు అన్ని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో యాజమాన్య కోటా కింద ఉన్న బి1, బి2, సి కేటగిరీ సీట్లను భర్తీ చేయనున్నారు. వీటితోపాటు తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా మెడికల్‌ కాలేజీలోని ఎన్నారై సీట్లను ఈ కౌన్సెలింగ్‌ ద్వారానే భర్తీ చేస్తారు. ఇందుకు సంబంధించి ఎవరికైన అభ్యంతరాలుంటే 89787 80501, 79977 10168 ఫోన్‌ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని పేర్కొంది. సాంకేతిక సమస్యలు తలెత్తితే 90007 80707 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించింది.

ఆగస్టు 20న ఏపీ ఐసెట్ సీట్‌ అలాట్‌మెంట్‌ రిజల్ట్‌.. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు గడువు ఎప్పటి వరకంటే

ఆంధ్రప్రదేశ్‌లోని పీజీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ 2024 మొదటి విడత కౌన్సెలింగ్‌ సీట్ల కేటాయింపు ఫలితాలు ఆగస్టు 21న విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో సీట్లు పొందిన అభ్యర్థుల వివరాలను అందుబాటులో ఉంచనుంది. ఫలితాల విడుదలైన తర్వాత అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబరు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సీట్ల అలాట్‌మెంట్‌ లెటర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 24వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ఏపీ ఐసెట్‌ 2024 అధికారిక వెబ్‌సైట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

ఆగస్టు 22 నుంచి ఏపీ డిగ్రీ రెండో విడత కౌన్సెలింగ్‌ షురూ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి గానై డిగ్రీ రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్‌ ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఆగస్టు 22 నుంచి 24వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవల్సి ఉంటుంది. ఆగస్టు 23 నుంచి 25 వరకు ధ్రువపత్రాల పరిశీలన, కోర్సులు, కళాశాలల ఎంపిక వెబ్‌ ఐచ్ఛికాల నమోదు చేసుకోవాలి. ఆగస్టు 26వ తేదీన వెబ్‌ ఐచ్ఛికాల మార్పునకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 29న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 3లోపు ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.