NTPC Jobs: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. NTPCలో పరీక్ష లేకుండానే ఉద్యోగాలు.. అర్హతలు తెలుసుకోండి..
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిది NTPC. అసిస్టెంట్ లా ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 10 ఖాళీలకు..
NTPC Recruitment 2022: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిది NTPC. అసిస్టెంట్ లా ఆఫీసర్స్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 10 ఖాళీలకు సంస్థ నోటిషికేష్ ఇచ్చింది. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్– ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 7 జనవరి 2022. NTPC (Sarkari Naukri)లో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది సువర్ణావకాశం అని చెప్పవచ్చు.
అర్హతలు
ఒక అభ్యర్థి కనీసం 60% మార్కులతో (SC/PWD అభ్యర్థులకు 55%) లాలో బ్యాచిలర్ డిగ్రీని (LLB లేదా గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం/సంస్థ నుండి తత్సమానం) కలిగి ఉండాలి. అభ్యర్థులు బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకొని ఉండాలి. అభ్యర్థి వయస్సు జనవరి 7, 2022 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అర్హత గల అభ్యర్థులు తప్పనిసరిగా CLAT-2021 (కామన్ లా అడ్మిషన్ టెస్ట్-2021) పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (నేషనల్ లా యూనివర్శిటీల కన్సార్టియం ద్వారా నిర్వహించబడుతుంది) కోసం హాజరై ఉండాలి.
జనరల్ / EWS / OBC వర్గానికి చెందిన అభ్యర్థులు రూ. 300 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఈ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాపసు చేయబడవు. ఏదైనా SBI శాఖలో ‘పే స్లిప్’ ద్వారా ఆన్‌లైన్‌లో అలాగే ఆఫ్‌లైన్‌లో చెల్లింపు చేయవచ్చు.
జీతం
CLAT-2021 పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ పనితీరు ఆధారంగా అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడతారు. అభ్యర్థులకు బేసిక్ పేపై రూ. 30,000 నుండి రూ. 1,20,000 మధ్య పే స్కేల్‌లో రిక్రూట్ ఉంటుంది.
ఇవి కూడా చదవండి: Fire Breaks: గయా రైల్వే జంక్షన్‌లో అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన రైలు..
CSIR UGC NET Exam 2021: CSIR UGC NET పరీక్ష వాయిదా.. కొత్త తేదీని ఇక్కడ చూడండి..