NIT Tiruchirappalli: ఎన్‌ఐటీ తిరుచిరపల్లిలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పోస్టులు.. అర్హులెవరు.?ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.
NIT Tiruchirappalli Recruitment: తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరపల్లిలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం...
NIT Tiruchirappalli Recruitment: తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరపల్లిలో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 92 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎవరు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలిలాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్ 2) పోస్టులను భర్తీ చేయనున్నారు. * ఆర్కిటెక్చర్, కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంట్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ స్టడీస్, మ్యాథమేటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరిలయ్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు టీచింగ్ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. * అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను తర్వాత రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేస్తారు. * ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 24-09-2021 నుంచి ప్రారంభమవుతుండగా దరఖాస్తు హార్డ్ కాపీలను పంపించడానికి 04-10-2021ని చివరి తేదీగా నిర్ణయించారు. * అభ్యర్థులు హార్డ్ కాపీలను ది రిజిస్టార్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిరుచిరపల్లి, 620015, తమిళనాడు అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. * నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Photos: ప్రపంచంలో ఇది వింతైన జలపాతం..! ప్రజలు కింది నుంచి పైకి జారిపోకుండా ఎక్కవచ్చు..
SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకు గమనిక..! ఆ వివరాలు కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనట..?
కాశ్మీర్ లో ఉగ్రవాద చర్యలను రెచ్చగొడతాం..సహకరించాలంటూ తాలిబన్లను కోరిన జైషే మహ్మద్ నేత