GATE Registration: ఆగస్టు 30 నుంచి GATE 2022 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్..! దరఖాస్తు ప్రక్రియ ఇలా ఉంటుంది..

GATE Registration: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) పరీక్ష నమోదు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. పోస్ట్‌గ్రాడ్యుయేట్

GATE Registration: ఆగస్టు 30 నుంచి GATE 2022 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్..! దరఖాస్తు ప్రక్రియ ఇలా ఉంటుంది..
Registration
Follow us
uppula Raju

|

Updated on: Aug 28, 2021 | 1:51 PM

GATE Registration: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) పరీక్ష నమోదు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే ఈ పరీక్ష నమోదు ప్రక్రియ ఆగస్టు 30, 2021 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆగష్టు 30 నుంచి అధికారిక వెబ్‌సైట్ సందర్శించడం ద్వారా నమోదు చేసుకోవచ్చు. చివరి తేదీ 24 సెప్టెంబర్ 2021 గా నిర్ణయించారు. అదే సమయంలో దరఖాస్తు ఫారమ్‌లు అక్టోబర్ 1, 2021 వరకు ఆలస్య రుసుముతో సమర్పించవచ్చు. ఈ తేదీ తర్వాత రిజిస్ట్రేషన్ లింక్ తొలగిస్తారు. గేట్ 2022 పరీక్ష 5 ఫిబ్రవరి, 6 ఫిబ్రవరి, 12 ఫిబ్రవరి, 13 ఫిబ్రవరి 2022 న నిర్వహిస్తారు. అయితే కోవిడ్ -19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దీనిని మార్చే అవకాశం ఉందని ఐఐటి ఖరగ్‌పూర్ తెలిపింది.

IIT ఖరగ్‌పూర్ ప్రకారం.. “గేట్ పరీక్షలో పాల్గొనేవారి ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.ప్రస్తుత COVID-19 మహమ్మారి పరిస్థితి కారణంగా ఈ వెబ్‌సైట్‌లో పేర్కొన్న అన్ని తేదీలు మారవచ్చు. పరిస్థితుల కారణంగా గేట్ 2022 పరీక్ష వాయిదా పడవచ్చు. లేదా రద్దు కూడా చేయవచ్చని ప్రకటించింది.

ముఖ్యమైన తేదీలు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ – 30 ఆగస్టు 2021 దరఖాస్తుకు చివరి తేదీ – 24 సెప్టెంబర్ 2021 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ – 01 అక్టోబర్ 2021 దరఖాస్తులో దిద్దుబాటు – 26 అక్టోబర్ నుంచి 1 నవంబర్ 2021 వరకు పరీక్ష నగరాన్ని మార్చడానికి చివరి తేదీ – 3 జనవరి 2022 గేట్ పరీక్ష తాత్కాలిక తేదీలు – 2022 ఫిబ్రవరి 5, 6, 12, 13 ఫలితాల విడుదల తాత్కాలిక తేదీ – 17 మార్చి 2022

రిజిస్ట్రేషన్ ఫీజు SC, ST, దివ్యాంగ , మహిళా అభ్యర్థులందరికీ గేట్ అప్లికేషన్ ఫీజు – రూ.750 ఆలస్య రుసుము మొత్తం రుసుముతో – రూ.1250 ఇతర అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము – రూ.1500

బాదంపప్పు నుంచి ఆయిల్‌ తీశారని డౌట్‌గా ఉందా..! అయితే అసలు నిజాలు తెలుసుకోండి..

రెండు జంతు జాతుల స్నేహబంధం.. హిప్పోపై తాబేళ్లు ఫ్రీ రైడ్.. వీడియో వైరల్:Turtles on Hippo Back Video.

Coronavirus: కరోనా ముప్పు ఇంకా పొంచి ఉంది.. పండగ సీజన్‌లో మళ్లీ పడగవిప్పొచ్చు.. రాష్ట్రాలను అలెర్ట్ చేసిన కేంద్రం.