ISRO Recruitment 2021: ఇస్రోలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా..!
ISRO Recruitment 2021: ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు..
ISRO Recruitment 2021: ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మోత్తం 8 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇస్రోకు చెందిన Liquid Propulsion Systems Centre (LPSC)లో ఈ నియామకాలు చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 24 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 6. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
హెవీ వెహికిల్ డ్రైవర్ -2 లైట్ వెహికిల్ డ్రైవర్- 2 కుక్ – 1 ఫైర్ మాన్ -2 క్యాటరింగ్ అటెండెంట్-1
విద్యార్హతల వివరాలు: టెన్త్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే పోస్టుల వారీగా కావాల్సిన అనుభవానికి సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్‌లో చూడవచ్చు.
ఫీజు: రూ.150 జీతం: పోస్టు ఆధారంగా రూ. 18 వేల నుంచి రూ. 63 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. కేవలం ఆన్‌లైన్ ద్వారా వచ్చే అప్లికేషన్లను మాత్రమే స్వీకరిస్తామని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. ఆఫ్ లైన్ ద్వారా పంపించే అప్లికేషన్లను పరిగణలోకి తీసుకోమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారానే ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.