SBI Customers: ఎస్బీఐ ఖాతాదారులకు గమనిక..! ఆ వివరాలు కావాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనట..?
SBI Customers: ఎస్బీఐ వినియోగదారుల కోసం చాలా సేవలను ప్రవేశపెట్టింది. అయితే ఖాతాదారులు కొన్ని విషయాలను కచ్చితంగా
SBI Customers: ఎస్బీఐ వినియోగదారుల కోసం చాలా సేవలను ప్రవేశపెట్టింది. అయితే ఖాతాదారులు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. బ్యాంక్ కొన్ని సేవలకు ఖాతాదారు నుంచి ఛార్జ్ వసూలు చేస్తుంది. దీని పరిధిలో బ్యాంక్ స్టేట్‌మెంట్ కూడా ఉంది. మీరు బ్యాంకుకు వెళ్లి మీ స్టేట్‌మెంట్ తీసుకుంటే బ్యాంక్ దానిపై ఛార్జ్ చేస్తుంది. అంటే మీ బ్యాంక్ స్టేట్‌మెంట్ మీకు ఉచితంగా లభించదని గుర్తించండి. అకౌంట్ స్టేట్‌మెంట్‌ను ప్రింట్ తీసుకుంటే ఎంత చెల్లించాలి.. తదితర విషయాలను ఒక్కసారి తెలుసుకుందాం.
వాస్తవానికి ఖాతా నుంచి వివరాలు పొందడానికి బ్యాంక్ తన నుంచి రూ.4180 ఛార్జి చేసిందని ఇటీవల ఒక కస్టమర్ ట్విట్టర్ ద్వారా కంప్లయింట్ ఇచ్చారు. అతను 4 నెలల స్టేట్‌మెంట్ కోసం రూ.4150 ఛార్జ్ చేశారని బ్యాంక్ స్టేట్‌మెంట్ 80 పేజీలు అంటే ఒక పేజీ కోసం రూ.50 తీసుకున్నారని అన్నారు. దీనిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చింది. ‘తప్పుడు ఛార్జీలు తీసుకున్నట్లు మీరు విశ్వసిస్తే మీరు SBI హెల్ప్‌లైన్ నంబర్ 1800 11 2211 (టోల్ ఫ్రీ), 1800 425 3800 (టోల్ ఫ్రీ) లేదా 080-26599990 కి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కాల్ చేసి అడగవచ్చని సూచించింది.
బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. మీరు ఖాతా స్టేట్‌మెంట్‌ను ఇమెయిల్ ద్వారా అడిగితే ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ మీరు అకౌంట్ స్టేట్‌మెంట్‌ను భౌతికంగా అడిగితే అప్పుడు మీరు ఒక్కో పేజీకి రూ.44 ప్లస్ GST చెల్లించాలి. అదే సమయంలో కరెంట్ ఖాతాలో ఒక పేజీ రేటు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. మీరు ఖాతా తెరిచినప్పుడు మొదటి పాస్‌బుక్ బ్యాంక్ మంజూరు చేస్తుంది. దానిపై ఎటువంటి ఛార్జీ ఉండదు. మొదటి పాస్ బుక్ మీకు ఉచితంగా ఇస్తారు. తరువాత మీరు మరొక పాస్‌బుక్ అడిగితే రూ.100 తో పాటు GST చెల్లించాలి. అలాగే పేజీకి రూ.50 ప్లస్ GST (40 ఎంట్రీలు) కూడా వసూలు చేస్తారు. ఈ రోజుల్లో పాస్‌బుక్‌లు ముద్రించడానికి కూడా ఛార్జ్ తీసుకుంటున్నారు.
@TheOfficialSBI i have been charged ₹4150 for bank statement of 4 month. Why there is no cap over maximum charges?? Bank statement is of 80 pages that is ₹50 for every 1 page. Pls justify this
— Devendra Singh (@rajputdev64) August 27, 2021