- Telugu News Photo Gallery Technology photos Bolt Release New Smartwatch Fire Boltt Agni Smartwatch Have A Look On Features
Fire Boltt Agni: తక్కువ ధరలో స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నారా.? అయితే బోల్ట్ కంపెనీకి చెందిన ఈ వాచ్‌పై ఓ లుక్కేయాల్సిందే.
Fire Boltt Agni: బోల్ట్ కంపెనీ తాజాగా మార్కెట్లోకి ఫైర్ బోల్ట్ అగ్ని పేరుతో ఓ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు ఈ స్మార్ట్ వాచ్ సొంతం. ఇందులో మహిళల కోసమే ప్రత్యేకంగా ఓ ఫీచర్‌ను తీసుకొచ్చారు...
Updated on: Aug 28, 2021 | 11:34 AM

ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల హవా నడుస్తోంది. ప్రముఖ కంపెనీలన్నీ స్మార్ట్ వాచ్‌లను విడుదల చేస్తుండడం, రకరకలా ఫీచర్లు అందుబాటులోకి తెస్తుండడంతో వినియోగదారులు కూడా అట్రాక్ట్ అవుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా బోల్ట్ కంపెనీ ‘ఫైర్ బోల్ట్ అగ్ని’ అనే స్మార్ట్ వాచ్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

సుమారు 80 గ్రాముల బరువు ఉండే ఈ వాచ్‌లో 1.4 అంగుళా హెచ్‌డీ స్క్రీన్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 4.4తో పాటు ఆ పైన వెర్షన్లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

ఈ స్మార్ట్ వాచ్‌లో స్లీప్‌ట్రాకర్, కరిగిన కెలోరీలు, నడిచిన దూరం, స్లీప్ మోనిటరింగ్, రిమోట్ మ్యూజిక్ కంట్రోల్, సెడెంట్రీ రిమైండర్స్ లాంటి పీచర్లు ఉన్నాయి.

ఇక ఇందులో మహిళల కోసమే ప్రత్యేకంగా మెన్‌స్ట్రువల్ రిమైండర్స్ ఆప్షన్‌ను ఇచ్చారు. దీంతో పీరియడ్స్ ట్రాకింగ్, ఒవెల్యూషన్, పెరిటైల్ డేస్ లాంటి వివరాలు కూడా ఉంటాయి.

ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఎనిమిది రోజుల వరకు ఈ వాచ్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ రూ. 2,999కి అందుబాటులో ఉంది.




