AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lic Jeevan Shanti: ఎల్‌ఐసీ వారి అద్భుత పాలసీ..! ఒక్కసారి పెట్టుబడి పెట్టి జీవితకాలం ఆదాయం పొందండి..

Lic Jeevan Shanti: పొదుపు ఎంత ముఖ్యమో కరోనా కాలంలో అందరికి తెలిసి వచ్చింది. మీరు ఉద్యోగం చేస్తున్నా, సొంత వ్యాపారం నిర్వహిస్తున్నా,

Lic Jeevan Shanti: ఎల్‌ఐసీ వారి అద్భుత పాలసీ..! ఒక్కసారి పెట్టుబడి పెట్టి జీవితకాలం ఆదాయం పొందండి..
uppula Raju
| Edited By: |

Updated on: Aug 28, 2021 | 3:35 PM

Share

Lic Jeevan Shanti: పొదుపు ఎంత ముఖ్యమో కరోనా కాలంలో అందరికి తెలిసి వచ్చింది. మీరు ఉద్యోగం చేస్తున్నా, సొంత వ్యాపారం నిర్వహిస్తున్నా, భవిష్యత్తు కోసం కొంత డబ్బు ఆదా చేయడం అవసరం. మీరు కుటుంబానికి పెద్ద అయితే కుటుంబ సభ్యుల పట్ల కొంత ఆందోళన ఉంటుంది. అటువంటి పరిస్థితిలో జీవిత బీమా మంచి ఎంపిక అవుతుంది. ఇందుకోసం ఎల్‌ఐసీ నుంచి మంచి స్కీమ్‌ ఉంది. ఈ పాలసీలో ఒక్కసారి డబ్బులు పెట్టుబడి పెడితే జీవిత కాలం ఆదాయం ఉంటుంది. ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

LIC యొక్క జీవన్ శాంతి LIC జీవన్ శాంతి పథకంలో ఒక్కసారి పెట్టుబడి పెడితే జీవితాంతం పెన్షన్ వస్తూనే ఉంటుంది. మీ వయస్సును బట్టి 5, 10, 15 లేదా 20 సంవత్సరాల తర్వాత పెన్షన్ ప్రారంభించవచ్చు. మీరు 45 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే మీరు ఏటా రూ.74,300 పెన్షన్ పొందుతారు. మీరు 5, 10, 15 లేదా 20 సంవత్సరాల తర్వాత పెన్షన్ ప్రారంభిస్తే అప్పుడు కొన్ని షరతులు ఉంటాయి కానీ పెన్షన్ మొత్తం పెరుగుతుంది. మీరు నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక ప్రాతిపదికన కూడా పెన్షన్ పొందవచ్చు

LIC జీవన్ శాంతి అనేది సమగ్ర వార్షిక ప్రణాళిక. ఇందులో వ్యక్తి, అతని కుటుంబం కూడా ప్రయోజనాలను పొందుతుంది. మీరు LIC ఏజెంట్ నుంచి LIC జీవన్ శాంతి పథకాన్ని కొనుగోలు చేయవచ్చు. లేదా మీరు మీ సమీప LIC కార్యాలయానికి వెళ్లడం ద్వారా దాన్ని యాక్టివేట్ చేయవచ్చు. కావాలంటే ఆన్‌లైన్‌లో కూడా పాలసీని కొనుగోలు చేయవచ్చు. మీ వయస్సు 30 సంవత్సరాల కంటే ఎక్కువ, 85 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. మీరు ఈ పాలసీపై రుణం కూడా తీసుకోవచ్చు. పాలసీకి సంబంధించి మీకు ఏదైనా సమస్య ఉంటే లేదా మీరు పాలసీని కొనసాగించడానికి ఇష్టపడకపోతే మీరు 3 నెలల తర్వాత ఎప్పుడైనా పాలసీని క్లోజ్‌ చేయవచ్చు.

Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్‌లో వేలకోట్ల విలువజేసే సహజవనరులు.. తాలిబన్ల పాలనలో ఆ నిధి ఎవరికి దక్కనుంది..

GATE Registration: ఆగస్టు 30 నుంచి GATE 2022 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్..! దరఖాస్తు ప్రక్రియ ఇలా ఉంటుంది..

TV9 KAB Education Summit: ఎంట్రీ ఫ్రీ.. కౌన్సెలింగ్ కూడా ఫ్రీ.. విద్యకు సంబంధించిన బోలెడన్ని విషయాలపై క్లారిటీ