NIN Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్ హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..

NIN Recruitment: ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. హైద‌రాబాద్‌లోని ఈ సంస్థ‌లో ప్రాజెక్ట్ యంగ్ ప్రొఫెష‌న‌ల్స్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు...

NIN Recruitment: నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్ హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..
Follow us
Narender Vaitla

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 11, 2022 | 10:18 AM

NIN Recruitment: ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్ ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. హైద‌రాబాద్‌లోని ఈ సంస్థ‌లో ప్రాజెక్ట్ యంగ్ ప్రొఫెష‌న‌ల్స్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివ‌రాలు మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్నఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 04 యంగ్ ప్రొఫెష‌న‌ల్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు బయోకెమిస్ట్రీ, ఫుడ్‌ కెమిస్టీ, మైక్రోబయాలజీ, అనలిటికల్‌ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.

* వీటితో పాటు రెండేళ్ల పరిశోధన అనుభవం త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు…

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తుల‌ను డైరెక్టర్, ఐసీఎంఆర్‌–నిన్,జామై ఉస్మానియా పోస్ట్,తార్నాక, హైదరాబాద్‌–500007 అడ్ర‌స్‌కు పంపించాలి.

* అభ్య‌ర్థుల వ‌య‌సు 45 ఏళ్లు మించ‌కూడ‌దు.

* ఎంపికైన వారికి జీతంగా నెల‌కు రూ. 35,000 అందిస్తారు.

* అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్టింగ్, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 25-01-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Viral Video: వామ్మో.. రోడ్డుకు అడ్డంగా భారీ ఫైథాన్.. చూసి హడలెత్తిపోయిన వాహనదారులు.. ఏం చేశారంటే..?

Viral Video: వామ్మో.. రోడ్డుకు అడ్డంగా భారీ ఫైథాన్.. చూసి హడలెత్తిపోయిన వాహనదారులు.. ఏం చేశారంటే..?

Cholesterol: కొలెస్ట్రాల్ తగ్గాలంటే ప్రతిరోజు ఈ 5 పండ్లు తినాలి..! అవేంటంటే..?