AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NHAI Jobs 2022: ఇంటర్వ్యూతోనే.. విజయవాడ నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. వివరాలివే!

భారత ప్రభుత్వ రోడ్డు, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI).. విజయవాడలోని ప్రాంత్రీయ కార్యాలయంలో యంగ్ ప్రొఫెషనల్స్‌ పోస్టుల (Young Professional Posts) భర్తీకి..

NHAI Jobs 2022: ఇంటర్వ్యూతోనే.. విజయవాడ నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు.. వివరాలివే!
Nhai
Srilakshmi C
|

Updated on: Mar 03, 2022 | 4:55 PM

Share

NHAI Vijayawada Recruitment 2022: భారత ప్రభుత్వ రోడ్డు, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI).. విజయవాడలోని ప్రాంత్రీయ కార్యాలయంలో యంగ్ ప్రొఫెషనల్స్‌ పోస్టుల (Young Professional Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 11

పోస్టుల వివరాలు: యంగ్ ప్రొఫెషనల్‌ (టెక్నాలజీ) పోస్టులు

పే స్కేల్‌: నెలకు రూ.60,000లు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: సివిల్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వ్యాలిడ్‌ గేట్‌ 2021 స్కోర్‌ ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Regional Officer, Regional Office-Vijayawada (Andhra Pradesh), National Highways Authority of India, Door No. 41-29-45A, R.S. No.373/2A, Kodandaramalyam, Chalasani Nagar, Ranigarithota, Krishnalanka, Vijayawada – 520013, Andhra Pradesh.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 25, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Telangana: మహబూబాబాద్‌ కేంద్రీయ విద్యాలయలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాలు.. రేపే ఆఖరు..