Neet Counselling 2021: NEET కౌన్సెలింగ్‌లో EWS రిజర్వేషన్‌పై కేంద్రం స్పందన.. సుప్రీం కోర్టుకు ఏం చెప్పిందంటే..
Neet Counselling 2021: NEET 2021 కౌన్సెలింగ్ విషయంలో కొత్త అప్‌డేట్ వచ్చింది. NEET కౌన్సెలింగ్ 2021 కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది..
Neet Counselling 2021: NEET 2021 కౌన్సెలింగ్ విషయంలో కొత్త అప్‌డేట్ వచ్చింది. NEET కౌన్సెలింగ్ 2021 కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ఇది రిలీఫ్ లాంటి న్యూస్ ఇది. NEET 2021 కౌన్సెలింగ్‌లో EWS రిజర్వేషన్ కోసం నిర్ణయించిన ప్రమాణాలను పునఃపరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయంలో నాలుగు వారాల్లో కొత్త నిర్ణయం తీసుకుంటామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. తుది నిర్ణయం తీసుకునే వరకు కౌన్సెలింగ్ ప్రారంభించబోమని సొలిసిటర్ జనరల్ మరోసారి సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు.
నీట్ కౌన్సెలింగ్ 2021లో EWS రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ రిజర్వేషన్ లబ్ది పొందేందుకు నిర్ణీత వార్షిక ఆదాయం రూ.8 లక్షలుగా నిర్ణయించారు. అయితే, ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించేలా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. ఆదాయంపై నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కేంద్రాన్ని కోర్టు కోరింది. దీనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (ఎస్జీ తుషార్ మెహతా) సుప్రీంకోర్టులో మాట్లాడుతూ.. ‘ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం వార్షిక ఆదాయ పరిమితిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 ప్రకారం నిర్దేశించబడింది. అయితే కేంద్రం దీనిని మరోసారి పరిశీలిస్తుంది. దీని కోసం మాకు 4 వారాల సమయం కావాలి.’ అని కోర్టును కోరారు. సొలిసిటర్ జనరల్ వాదనలు విన్న కోర్టు.. ఈ అంశంపై తదుపరి విచారణను 06 జనవరి 2022కి వాయిదా వేసింది.
Also read:
Vikram: మళ్లీ పట్టాలెక్కిన కోబ్రా షూటింగ్.. సినిమా విడుదల ఎప్పుడంటే..
Indian Oil: ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC..