NEET UG 2024 Counselling: నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ వాయిదా.. అప్పటి వరకు నో అడ్మిషన్లు!

నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఇటీవల నీట్‌ యూజీ పరీక్షలో పేపర్‌ లీకేజీలు, గ్రేస్‌ మార్కుల వ్యవహారంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్ధులు, పలువురు నేతలు ఆందోళన చేశారు. కాగా నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం ఆలస్యంగా అందిందన్న కారణంగా 1563 మందికి గ్రేస్‌ మార్కులు ఇచ్చారు...

NEET UG 2024 Counselling: నీట్‌ యూజీ 2024 కౌన్సెలింగ్‌ వాయిదా.. అప్పటి వరకు నో అడ్మిషన్లు!
NEET UG 2024 counselling postponed
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 07, 2024 | 3:32 PM

న్యూఢిల్లీ, జులై 7: నీట్‌ యూజీ కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఇటీవల నీట్‌ యూజీ పరీక్షలో పేపర్‌ లీకేజీలు, గ్రేస్‌ మార్కుల వ్యవహారంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్ధులు, పలువురు నేతలు ఆందోళన చేశారు. కాగా నీట్ పరీక్షలో ప్రశ్నాపత్రం ఆలస్యంగా అందిందన్న కారణంగా 1563 మందికి గ్రేస్‌ మార్కులు ఇచ్చారు. దీంతో నీట్‌ ర్యాంకుల్లో గణీనయమైన మార్పులు వచ్చాయి. పైగా ఏకంగా 67 మందికి టాప్‌ ర్యాంకు రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా విద్యార్ధులు ఆందోళనకు దిగడంతో 1563 మందికి ఇచ్చిన గ్రేస్‌ మార్కులను తొలగించి వారందరికీ నీట్‌ యూజీ రీ-ఎగ్జాం నిర్వహించారు. అనంతరం సవరించిన ర్యాంకు కార్డులను పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్ధులందరికీ జారీ చేశారు. దీంతో ట్యాప్‌ ర్యాంకర్ల సంఖ్య 67 నుంచి 61కి తగ్గింది. అయితే పేపర్‌ లీక్‌, ఓమ్మార్ షీట్ల వ్యవహారం ఇంకా తేలలేదు. దీంతో విద్యార్ధులు నీట్‌ యూజీ పరీక్షను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్లు వేశారు. వీటిని విచారించిన అత్యున్నత ధర్మాసనం పరీక్ష రద్దు కుదరదంటూ తేల్చిచెప్పింది.

అయితే NEET UG 2024 కౌన్సెలింగ్ తదుపరి నోటీసు వచ్చేవరకు వాయిదా పడింది. NEET UG ఆల్-ఇండియా కోటా (AIQ) సీట్ కౌన్సెలింగ్ వాస్తవానికి జూలై 6న ప్రారంభం కావాల్సి ఉంది. అదే రోజు ప్రారంభం కావాల్సిన నీట్ యూజీ కౌన్సెలింగ్‌ను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. న్యాయమూర్తులు JB పార్దివాలా, మనోజ్ మిశ్రాతో పాటు CJI డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నీట్‌ వివాదానికి సంబంధించి పలు పిటిషన్లను జూలై 8న విచారించనుంది. ఈ పిటిషన్లలో పేపర్ లీక్ ఆరోపణలు ఉన్నాయి. మొత్తం పరీక్షను రద్దు చేయడంతోపాటు, పరీక్ష పునః నిర్వహణ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తీరుపై విచారణకు ఆదేశించాలన్న డిమాండ్ల పరిష్కారానికి విద్యార్ధులు ఈ మేరకు పిటిషన్లు జారీ చేశారు.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) 202-25 విద్యాసంవత్సరానికి సంబంధించి నీట్ యూజీ, పీజీ కోర్సుల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఇంకా ఖరారు చేయలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే