NEET Exam: నేడు రాష్ట్ర వ్యాప్తంగా నీట్ పరీక్ష.. అభ్యర్థులూ ఈ విషయాలు అస్సలు మరవొద్దు..

NEET Exam 2022: వైద్య విద్యలో అండర్‌ గ్రాడ్యుయేట్ సీట్ల భర్తీకిగాను నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నేడు తెలంగాణ వ్యాప్తంగా జరగనుంది. ఇందుకోసం...

NEET Exam: నేడు రాష్ట్ర వ్యాప్తంగా నీట్ పరీక్ష.. అభ్యర్థులూ ఈ విషయాలు అస్సలు మరవొద్దు..
NEET Exam
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 17, 2022 | 6:10 AM

NEET Exam 2022: వైద్య విద్యలో అండర్‌ గ్రాడ్యుయేట్ సీట్ల భర్తీకిగాను నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) నేడు తెలంగాణ వ్యాప్తంగా జరగనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. నేడు (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 నిమిషాల వరకు పరీక్ష జరగనుంది. సాధారణంగా నీట్‌ పరీక్ష గడువు మూడు గంటలు మాత్రమే ఉండేవి కానీ ఇప్పుడు 20 నిమిషాలు పెంచి 3.20 గంటలకు చేశారు.

దీంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 200 ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు 200 నిమిషాలు కేటాయించారన్నమాట. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 25 పట్టణాల్లో 115 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థులు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సహా ఇతర ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష రాయొచ్చు. తెలంగాణలో సుమారు 60 వేల మంది విద్యార్థులు నీట్‌ పరీక్షకు హాజరుకానున్నారు.

విద్యార్థులు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి..

* విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆ తర్వాత వచ్చిన వారిని అనుమతించరు.

ఇవి కూడా చదవండి

* మాల్‌ ప్రాక్టిస్‌, నిబంధనలు ఉల్లంఘించిన వారిని మూడేళ్లపాటు పరీక్షరాయకుండా డిబార్‌ చేస్తారు.

* జవాబు పత్రం నుంచి ఏ కారణంతోనూ పేజీలు చింపకూడదు.

* విద్యార్థులు అడ్మిట్ కార్డ్, ఇతర పత్రాలను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి. అలాగే ఏదో ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి.

* ఉంగరాలు, బ్రాస్‌లెట్లు, చెవిపోగులు, ముక్కు పుడకలు, గొలుసులు, నెక్లెస్‌లు, బ్యాడ్జ్‌లు, హెయిర్‌పిన్‌లు, హెయిర్ బ్యాండ్‌లు, తాయెత్తులు, గాగుల్స్, హ్యాండ్‌బ్యాగులను ధరించకూడదు.

* మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి.

* అభ్యర్థులు సాధారణ చెప్పులు మాత్రమే వేసుకోవాలి, షూస్‌ అనుతమించరు.

* పరీక్ష కేంద్రంలోనే అభ్యర్థులకు బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్ను ఇస్తారు

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..