NIRF Rankings 2022: ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్ 2022లో చండీగఢ్ యూనివర్సిటీ సత్తా!
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలో 29వ ర్యాంక్ సాధించింది. భారత యూనివర్సిటీల్లో అనతికాలంలోనే టాప్ 30 లీగ్‌లోకి ప్రవేశించిన యంగెస్ట్ యూనివర్సిటీగా పేరుగాంచిందని ఛాన్సలర్ ఎస్ సత్నామ్ సింగ్ సంధు ఈ రోజు..
Chandigarh University Record in NIRF Rankings- 2022: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలో చండీగఢ్ యూనివర్సిటీ 29వ ర్యాంక్ సాధించింది. భారత యూనివర్సిటీల్లో అనతికాలంలోనే టాప్ 30 లీగ్‌లోకి ప్రవేశించిన యంగెస్ట్ యూనివర్సిటీగా పేరుగాంచిందని ఆ యూనివర్సిటీ ఛాన్సలర్ ఎస్ సత్నామ్ సింగ్ సంధు శనివారం (జులై 16) మీడియాకు తెలిపారు. నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ర్యాంకింగ్స్ 2022ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ఈ రోజు విడుదల చేసిన కొన్ని గంటల తర్వాత చండీగఢ్ యూనివర్సిటీ ఛాన్సలర్ మీడియా సమావేశంలో ఈ మేరకు తెలిపారు. ఆయన ఇంకా ఈ విధంగా మాట్లాడారు.. ‘చండీగఢ్ యూనివర్సిటీ యంగెస్ట్ యూనివర్సిటీ మాత్రమే కాదు, QS వరల్డ్, QS ఏషియా, ఎన్‌ఐఆర్‌ఎఫ్ లేదా న్యాక్ వంటి జాతీయ, అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో స్థానం పొందిన ఏకైక యూనివర్సిటీ. పంజాబ్‌లోనున్న అన్ని యూనివర్సిటీల్లో ప్రథమ స్థానంలో నలిచింది. ప్రైవేట్ యూనివర్సిటీలో రెండో స్థానంలో ఉంది. దేశంలోనున్న యూనివర్సిటీల్లో 48వ ర్యాంకులో, పబ్లిక్, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్లలో 4వ స్థానంలో నిలిచింది. చండీగఢ్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్ధుల అకడమిక్ ఎక్సలెన్స్, ఇండస్ట్రీ ప్రోవెస్ కారణంగా NIRF ర్యాంకింగ్స్‌లో సత్తా చాటింద’ని సంధు అన్నారు.
‘పంజాబ్, ట్రిసిటీలలోనున్న అన్నీ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూషన్లలో 3వ స్థానం, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్లలో 2వ స్థానంలో నిలిచింది. దేశంలోని అన్నీ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూషన్లలో 45వ స్థానం కైవసం చేసుకుంది. మేనేజ్‌మెంట్ విభాగంలో దేశంలో40వ స్థానం, రాష్ట్రంలో రెండో స్థానం దర్కించుకుంది. అర్కిటెక్చర్ విభాగంలో దేశంలో 19వ స్థానం, రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింద’ని ఆయన అన్నారు. ‘విద్యా సంస్థ ప్రమాణాలను అంచనా వేయడానికి ర్యాంకింగ్స్ అనేవి కొలమానాల వంటివి. నేటి ఫలితాలతో ఉన్నత చదువులు చదవాలనుకునే యువతకు దేశంలోనే బెస్ట్ యూనివర్సిటీ ఏదో తెలుసుకునేందుకు అవకాశం కలిగిందన్నారు. విద్యార్ధుల పురోగతిపైనే వర్సిటీ పూర్తి దృష్టి పెట్టింది. ఈ కారణంగానే ప్రతి జాతీయ, అంతర్జాతీయ అకడమిక్ ర్యాంకింగ్స్‌లో రాణిస్తున్నామని’ సంధు వ్యాఖ్యానించారు.
టాప్ బిజినెస్ సంస్థల చూపు యూనివర్సిటీ విద్యార్ధుల వైపు.. ‘చండీగఢ్ విశ్వవిద్యాలయం ఎన్నో యేళ్లగా ఇండస్ట్రీ లీడర్లకు ప్రాధాన్యత కలిగిన భాగస్వామిగా ఉంటోంది. ఇక్కడ చదివిన విద్యార్థులను టాప్ బిజినెస్ సంస్థలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ ఏడాది నార్త్ ఇండియాలో అత్యధికంగా 900లకు పైగా కంపెనీల నుంచి మా విద్యార్థులకు 9500లకు పైగా జాబ్ ఆఫర్లు రూ. 1.7 కోట్ల ప్యాకేజీతోవచ్చాయి. యూనివర్సిటీ నుంచి ఇప్పటివరకు 1816 పేటెంట్లను దాఖలు చేసాం. గత మూడేళ్లలో అత్యధిక సంఖ్యలో పేటెంట్లను ఫైల్ చేసిన సంస్థగా, 80 కంటే ఎక్కువ దేశాల్లో 450 ఇంటర్నేషనల్ యూనివర్సిటీలతో అకడమిక్ టై-అప్ చేసుకున్నామన్నారు. పై అన్ని విషయాల్లో అత్యున్నత ప్రతిభకనబరిచినందున క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్-2023లోకి ప్రవేశించిన న్యాక్ A+ గ్రేడ్ పొందిన యంగెస్ట్ యూనివర్సిటీగా నిలబడగలిగాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 800 సంస్థల్లో ఒకటిగా అవతరించాం. భారతదేశంలోని టాప్ 5శాతం ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాంక్ సాధించగలిగామరి ఛన్సలర్ సంధు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.