AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhanzu: లెక్కలతో మ్యాజిక్‌ చేస్తున్న తెలుగు కుర్రాడు.. స్టార్టప్‌కు భారీ ఫండింగ్‌..

మ్యాథ్స్‌ అనగానే చాలా మంది పిల్లలు భయపడతారు. చాలా మందికి అదే బ్రహ్మ పదార్థం. అయితే అలాంటి కఠినమైన మ్యాథ్స్‌ను ఎంతో సులభంగా చెబుతున్నాడు నీలకంఠ భాను. భాన్జు పేరుతో ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ను ప్రారంభించి దేశాన్ని తనవైపు తిప్పుకున్నాడు ఈ హైదరాబాదీ. ఈ క్రమంలోనే తాజాగా ఈ కంపెనీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది...

Bhanzu: లెక్కలతో మ్యాజిక్‌ చేస్తున్న తెలుగు కుర్రాడు.. స్టార్టప్‌కు భారీ ఫండింగ్‌..
Bhanzu
Narender Vaitla
|

Updated on: Nov 12, 2024 | 10:50 AM

Share

లెక్కలు అంటేనే చాలా మంది భయపడుతుంటారు. మ్యాథ్స్‌ క్లాస్‌ అంటేనే హర్రర్‌గా ఫీలయ్యే స్టూడెంట్స్‌ ఎంతో మంది ఉంటారు. అయితే గణితాన్ని ఇష్టపడితే దానంత సులువైంది, ఛాలెంజింగ్ సబ్జెక్ట్‌ మరొకటి ఉండదని నిపుణులు చెబుతున్నారు. కష్టంగా భావించే గణితాన్ని సులభంగా బోధిస్తూ ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాడు తెలుగు కుర్రాడు నీలకంఠ భాను. ఆధునిక పద్ధతుల్లో మ్యాథ్స్‌ను నేర్పించేందుకు భాను.. భాన్జు అనే ఓ స్టార్టప్‌ను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ స్టార్టప్‌కు భారీగా ఫండింగ్‌ లభించడ విశేషం.

శకుంతలా దేవి ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన ప్రపంచ అత్యంత వేగవంతమైన మానవ కాలిక్యులేటర్ – నీలకంఠ భాను.. భాన్జు పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించారడు. విద్యార్థులకు సులభమైన పద్ధతుల్లో గణితంలో మెలుకువలు నేర్పడించడమే ఈ స్టార్టప్‌ ముఖ్య ఉద్దేశం. అయితే కేవలం కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం చేయకుండా ఈ సంస్థను అమెరియా, యూకేతో పాటు మిడిల్‌ ఈస్ట్‌ మార్కెట్‌లోకి కూడా విస్తరించేందుకు భాను ప్రణాళికలు రచిస్తున్నాడు.

ఇందులో భాగంగానే ఈ గ్లోబల్ మ్యాథ్-లెర్నింగ్ ఎడ్యు-టెక్ స్టార్టప్.. ఎపిక్ క్యాపిటల్ నేతృత్వంలోని జెడ్ 3 వెంచర్స్, యైట్ రోడ్స్, లైట్‌స్పీడ్ వెంచర్స్ నుండి నిరంతర మద్దతుతో సిరీస్- బి ఫండింగ్ రౌండ్‌లో $16.5 మిలియన్లను సేకరించింది. మన కరెన్సీలో చెప్పాలంటో సుమారు రూ. 140 కోట్లు. రాబోయే ఐదేళ్లలో 100 మిలియన్ల విద్యార్థులకు చేరువకావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. భాన్జు సబ్‌స్క్రిప్షన్లు కూడా ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి.

నిజ జీవితాన్ని కనెక్ట్‌ చేస్తూ గణితాన్ని నేర్పించే విధానం ఎంతో ఆకట్టుకుంటుంది. , విద్యార్థులు గణితాన్ని కేవలం అకాడమిక్స్‌ మాత్రమే పరిమితం కాకుండా రోజువారీ సమస్యల పరిష్కారానికి ఉపయోగించేలా రూపొందించారు. ఇందుకోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సైతం ఉపయోగిస్తున్నారు. ఇక నీలకంఠ భాను.. లండన్‌లో 2020లో జరిగి మైండ్ స్పోర్ట్స్ ఒలింపిక్స్‌లో మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడిగా రికార్డు సృష్టంచాడు. గణితంపై తనకున్న అభిరుచితో, భాను గణితాన్ని ఆనందదాయకంగా, అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాడు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!