NVS Non Teaching Jobs: నవోదయ విద్యాలయాల్లో 1377 నాన్ టీచింగ్ పోస్టులు.. టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు
నవోదయ విద్యాలయ సమితి నోయిడాలోని ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతీయ కార్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1377 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..
నవోదయ విద్యాలయ సమితి నోయిడాలోని ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతీయ కార్యాలయాలు, జవహర్ నవోదయ విద్యాలయాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 1377 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టును బట్టి 10వ తరగతి, 12వ తరగతిలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు ఇలా..
మొత్తం పోస్టులు: 1377
- ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులు: 121
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు: 5
- ఆడిట్ అసిస్టెంట్ పోస్టులు: 12
- జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ పోస్టులు: 4
- లీగల్ అసిస్టెంట్ పోస్టులు: 1
- స్టెనోగ్రాఫర్ పోస్టులు: 23
- కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు: 2
- క్యాటరింగ్ సూపర్‌వైజర్ పోస్టులు: 78
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు: 381
- ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ పోస్టులు: 128
- ల్యాబ్ అటెండెంట్ పోస్టులు: 161
- మెస్ హెల్పర్ పోస్టులు: 442
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు: 19
కేంద్రీయ విద్యాలయ సమితి వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు తేదీలు, పరీక్ష తేదీలను త్వరలో వెల్లడిస్తారు. దరఖాస్తు సమయంలో జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.1500,ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్ధులు రూ.500 చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.