NHPC Recruitment: గేట్ స్కోర్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
NHPC Recruitment: నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌హెచ్‌పీసీలో మొత్తం 67 ఖాళీలను..
NHPC Recruitment: నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌హెచ్‌పీసీలో మొత్తం 67 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 67 ఖాళీలకు గాను సివిల్ ఇంజనీర్ (29), మెకానికల్ (20), ఎలక్ట్రికల్ ఇంజనీర్ (04), ట్రైనీ ఆఫీసర్ ఫైనాన్స్ (12), కంపెనీ సెక్రటరీ (02) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత బ్రాంచీలో ఇంజనీర్ పూర్తి చేసి ఉండాలి. ఇక ట్రైనీ ఆఫీసర్ పోస్టులకు సీఎ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏ పూర్తి చేసి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను గేట్ స్కోర్, సీఏ, సీఎంఏ, సీఎస్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం రూ. 295 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 17-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Doctors protesting: ముదిరిన పీజీ నీట్ కౌన్సిలింగ్.. పోలీసుల ప్రవర్తనపై రెసిడెంట్ డాక్టర్ల ఆగ్రహం