NHSRCL Recruitment: నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం పొందే అవకాశం
నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (NHSRCL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ప్లానింగ్, సివిల్, ఎలక్ట్రికల్, హ్యూమన్ రిసోర్స్.. విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు...
నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (NHSRCL) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ప్లానింగ్, సివిల్, ఎలక్ట్రికల్, హ్యూమన్ రిసోర్స్.. విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? అర్హతలు ఏంటి.?లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 44 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/డిప్లొమా/బీఈ/బీటెక్/ఎంబీఏ/ఎంఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* అభ్యర్థులను కంప్యూటర్ బేస్‌డ్ పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 35,000 నుంచి రూ. 1.6 లక్ష వరకు చెల్లిస్తారు.
* అప్లికేషన్ ఫీజుగా రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు మే 31ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..