AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS EAMCET: బుధవారం నుంచి తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలు.. ఈ ఏడాది అమల్లోకి కొత్త నిబంధన

తెలంగాణలో ఎంసెట్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఎంసెట్ పరీక్షలకు జేఎన్టీయూ హైదరాబాద్‌ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 10, 11 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడికల్ విభాగాల వారికి, 12,13,14 తేదీల్లో ఇంజనీరింగ్‌ విద్యార్థులకు పరీక్షలు ఉండనున్నాయి...

TS EAMCET: బుధవారం నుంచి తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలు.. ఈ ఏడాది అమల్లోకి కొత్త నిబంధన
TS EAMCET
Narender Vaitla
|

Updated on: May 09, 2023 | 8:04 AM

Share

తెలంగాణలో ఎంసెట్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం నుంచి 14వ తేదీ వరకు జరగనున్న ఎంసెట్ పరీక్షలకు జేఎన్టీయూ హైదరాబాద్‌ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 10, 11 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడికల్ విభాగాల వారికి, 12,13,14 తేదీల్లో ఇంజనీరింగ్‌ విద్యార్థులకు పరీక్షలు ఉండనున్నాయి. మెదటి సెషన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక పరీక్షా సెంటర్‌ల విషయానికొస్తే.. తెలంగాణలో 104, ఏపీలో 33 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంసెట్‌ పరీక్షలకు రాష్ట్రంలో తొలిసారి 132 అబ్జర్వర్లను నియమించారు.

ఒక్క హైదరాబాద్‌లోనే 84 మంది అబ్జర్వర్లు విధులు నిర్వర్తించనున్నారు. ఉదయం సెషన్‌లో 7:30 గంటల నుంచి, మధ్యాహ్నం సెషన్‌లో 1:30 గంటల నుంచే పరీక్షాకేంద్రాల్లోకి అభ్యర్థులను అనుమతిస్తారు. ఇదిలా ఉంటే ఈసారి ఎంసెట్‌ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏదైనా ఒరిజినల్‌ కార్డును చూపిస్తేనే అనుమతిస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ డీన్‌కుమార్‌, కోకన్వీనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. కాలేజీ ఐడీ కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీలలో ఏదో ఒక ఒరిజినల్‌ కార్డును వెంట తెచ్చుకోవాలని సూచించారు. జిరాక్స్‌, స్కాన్డ్‌ కాపీ చూపిస్తే అనుమతించబోమని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఆ రెండు సీన్లు యాడ్ చేసి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది..
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ఐపీఎల్ 2026 కోసం ఆర్సీబీ ప్లేయర్లకు విరాట్ వార్నింగ్
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
ప్రియుడి మోజులో భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
గత 15 ఏళ్లలో ఇదే భారీ తగ్గింపు.. రికార్డ్‌ స్థాయిలో తగ్గనున్నాయ్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
ఈ నాలుగు ఇంట్లో ఉంటే డాక్టర్ తో పనిలేదు.. అన్ని సమస్యలు చెక్
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
డాక్టర్ బాబు దొంగ తెలివితేటలు.. ఎగ్జాంలో కాపీకి ఏం చేశాడో చూడండి!
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
దేవాన్ష్ బర్త్‌డే వేళ భక్తులకు అల్పాహారం వడ్డించిన నారా కుటుంబం..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర ప్యాకేజీ.. ఆధ్యాత్మిక కేంద్రాల..
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
జనంపై పేలుతున్న పెట్రో బాంబ్.. ధరలు మళ్లీ పెంపు
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!
ఇరాన్ న్యూక్లియర్‌ ప్లాంట్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ బలగాల దాడి!