MMRCL Recruitment: ముంబయి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఇంజనీర్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక.
MMRCL Recruitment: ముంబయి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో...
MMRCL Recruitment: ముంబయి మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సీఎల్) మహారాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి ప్రాజెక్ట్ అనే విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* మొత్తం 19 ఖాళీలకు గాను డిప్యూటీ ఇంజనీర్ (07), జూనియర్ ఇంజనీర్ (12) పోస్టులను భర్తీ చేయనున్నారు. * పీఎస్‌టీ, ఈ అండ్ ఎం విభాగాల్లో ఈ పోస్టులను తీసుకోనున్నారు. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు.. ఎలక్ట్రికల్/మెకానికల్ సబ్జెక్టుల్లో డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.34,020 నుంచి రూ.64,310 చెల్లిస్తారు. * అభ్యర్థులను అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు. * అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * దరఖాస్తును జనరల్ మేనేజర్(హెచ్‌ఆర్), ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఎంఎంఆర్‌జీఎల్–లైన్3 ట్రాన్సిట్ ఆఫీస్, ఈ బ్లాక్, బంద్రా కుర్లా కాంప్లెక్స్, బంద్రా(ఈస్ట్), ముంబై–400051 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది. * ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా 31.08.2021ని నిర్ణయించారు. * పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..