MSME Recruitment 2022: బీఈ/బీటెక్ అర్హతతో నెలకు రూ.లక్షన్నర జీతంతో కేంద్ర కొలువులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
భారత ప్రభుత్వ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన రాజస్థాన్ రాష్ట్రంలోని భీవాడిలోనున్న మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ టెక్నాలజీ సెంటర్.. ఒప్పంద ప్రాతిపదికన 14 సీనియర్ ఇంజినీర్, ఇంజినీర్ (ట్రైనింగ్), సీనియర్ టెక్నీషియన్ మెయింటెనెన్స్ (ఈఎల్‌ఈ, మెకానికల్) తదితర పోస్టుల భర్తీకి..
భారత ప్రభుత్వ పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన రాజస్థాన్ రాష్ట్రంలోని భీవాడిలోనున్న మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ టెక్నాలజీ సెంటర్.. ఒప్పంద ప్రాతిపదికన 14 సీనియర్ ఇంజినీర్, ఇంజినీర్ (ట్రైనింగ్), స్టోర్ ఆఫీసర్, సీనియర్ టెక్నీషియన్ (ప్రొడక్షన్), సీనియర్ టెక్నీషియన్ మెయింటెనెన్స్ (ఈఎల్‌ఈ, మెకానికల్) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, బీఈ, బీటెక్, కామర్స్ డిగ్రీ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్ 20, 2022వ తేదీ నాటికి 30 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు అక్టోబర్ 31, 2022వ తేదీలోపు దరఖాస్తులను పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధాకంగా ఎంపిక నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.29,200ల నుంచి రూ.1,42,400ల వరకు జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- సీనియర్ ఇంజినీర్(ట్రైనింగ్) పోస్టులు: 1
- సీనియర్ ఇంజినీర్(డిజైన్) పోస్టులు: 2
- సీనియర్ ఇంజినీర్(ప్రొడక్షన్) పోస్టులు: 1
- ఇంజినీర్(ట్రైనింగ్)- మెకానికల్ పోస్టులు: 1
- ఇంజినీర్(ట్రైనింగ్)- ఎలక్ట్రానిక్స్ పోస్టులు: 1
- ఇంజినీర్(ప్రొడక్షన్) పోస్టులు: 2
- స్టోర్ ఆఫీసర్ పోస్టులు: 1
- సీనియర్ టెక్నీషియన్(ప్రొడక్షన్) పోస్టులు: 2
- సీనియర్ టెక్నీషియన్(ట్రైనింగ్) పోస్టులు: 1
- సీనియర్ టెక్నీషియన్ మెయింటెనెన్స్(ఈఎల్‌ఈ, మెకానికల్) పోస్టులు: 2
అడ్రస్: THE DY. GENERAL MANAGER, PLOT NO SP3, 871(A), 872, RIICO INDUSTRIAL ESTATE PATHREDI, POST OFFICE–TAPUKADA, BHIWADI 301019 (RAJASTHAN).
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.