NEET UG 2024 Counselling: సెప్టెంబర్ 5 నుంచి నీట్ యూజీ రెండో రౌండ్ కౌన్సెలింగ్.. విద్యార్ధులకు ముఖ్య సూచనలు
నీట్ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలకు సంబంధించి తొలి రౌండ్ సీట్ అలాట్‌మెంట్ ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ర్యాంకు, ప్రాధాన్యతలు తదితరాల ఆధారంగా ఎంసీసీ అభ్యర్థులకు సీట్లను కేటాయించింది. తొలి రౌండులో దాదాపు 26,109 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. సీటు లభించిన అభ్యర్థులు..
న్యూఢిల్లీ, ఆగస్టు 28: నీట్ ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలకు సంబంధించి తొలి రౌండ్ సీట్ అలాట్‌మెంట్ ఫలితాలను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ర్యాంకు, ప్రాధాన్యతలు తదితరాల ఆధారంగా ఎంసీసీ అభ్యర్థులకు సీట్లను కేటాయించింది. తొలి రౌండులో దాదాపు 26,109 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. సీటు లభించిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ప్రొవిజినల్ అలాట్‌మెంట్ లెటర్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీటు పొందిన అభ్యర్థులు సంబంధిత కాలేజీల్లో ఆగస్టు 29వ తేదీలోగా రిపోర్టు చేసి, ప్రవేశాలు పొందవల్సి ఉంటుంది. MCC ద్వారా ఇన్‌స్టిట్యూట్‌లలో చేరిన అభ్యర్థుల డేటా ధృవీకరణ ఆగస్టు 30 నుంచి ఆగస్టు 31 వరకు పొందుపరుస్తారు. రౌండ్ 1లో సీట్లు పొంది, రిపోర్టు చేయని విద్యార్ధులు రౌండ్ 2 కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. అధికారిక ప్రకటన ప్రకారం.. సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు రౌండ్ 2 కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎంపికల ఫిల్లింగ్/లాకింగ్ సదుపాయం సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఇస్తారు. సీట్ల కేటాయింపు ప్రక్రియ సెప్టెంబర్ 11 నుంచి సెప్టెంబర్ 12 వరకు జరుగుతుంది. ఫలితాలు సెప్టెంబర్ 13న ప్రకటిస్తారు.
నీట్ యూజీ 2024 తొలి రౌండ్ సీట్ అలాట్‌మెంట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టీజీపీఎస్సీ అసిస్టెంట్ సర్జన్ అభ్యర్థుల ఫైనల్ రిజల్ట్స్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని పశుసంవర్ధక శాఖలో అసిస్టెంట్ సర్జన్ (క్లాస్-ఎ & క్లాస్-బి) పరీక్షకు సంబంధించిన తుది ఎంపిక జాబితా విడుదలైంది. మొత్తం 171 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు లభించాయి. ఈ పోస్టులకు గతేడాది జులై నెలలో పరీక్షలు జరిగాయి. ఎంపికైన అభ్యర్థులకు జులైలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించగా.. తాజాగా తుది ఎంపిక జాబితాను విడుదల చేశారు.
గుంటూరు అగ్రి బీఎస్సీ కోర్సుల్లో ఎన్‌ఆర్‌ఐ కోటాకు ప్రవేశాల దరఖాస్తులు ఆహ్వానం
ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సారానికి బీఎస్సీ (హాన్స్) వ్యవసాయం, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (కమ్యూనిటీ సైన్స్) కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్‌ఆర్‌ఐ కోటాలో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ జి రామచంద్రరావు ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులతో పాటు పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.