ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ఓవర్సీస్‌ విద్యా పథకం ఎంతో అద్భుతం: మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పేద విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ సర్కార్‌ అమలు చేస్తున్న ఓవర్సీస్‌ విద్యా పథకం ఎంతో అద్భుతమని రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శనివారం అసెంబ్లీ.

ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ఓవర్సీస్‌ విద్యా పథకం ఎంతో అద్భుతం: మంత్రి కొప్పుల ఈశ్వర్‌
Koppula Eshwar
Follow us
Subhash Goud

|

Updated on: Mar 21, 2021 | 8:03 AM

పేద విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ సర్కార్‌ అమలు చేస్తున్న ఓవర్సీస్‌ విద్యా పథకం ఎంతో అద్భుతమని రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శనివారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో ఓవర్సీస్‌ విద్యాపథకంపై పలువురు గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే యువతకు ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.20 లక్షలు అందజేస్తోందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన విజయవంతంగా అమలు చేస్తున్న పథకాల్లో ఇదో గొప్ప పథకం అని అన్నారు. ఇలాంటి అద్భుతమైన పథకాలు తెలంగాణలో మినహా దేశంలో ఎక్కడా కూడా అమలు కావడం లేదని స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 3,676 మంది విద్యార్థులకు ఈ పథకం కింద చేయూతనిచ్చామన్నారు. ఇందులో ప్రభుత్వం రూ.589 కోట్ల 69 లక్షలు వెచ్చించిందని, లబ్దిదారుల్లో అమెరికాలో 54 శాతం, ఆస్ట్రేలియాలో 21శాతం, ఇంగ్లాండ్‌లో 11.5శాతం, కెనడా, సింగపూర్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, జపాన్‌, న్యూజిలాండ్‌, దక్షిణ కొరియా తదితర దేశాల్లో చదువుతున్నారని మంత్రి కొప్పుల అన్నారు. కుటుంబంలో ఎంబీబీఎస్‌ చదివే ఒక్కరికి మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేయగా, మరొకరికి కూడా వర్తింపజేయాలన్న సభ్యుల కోరికను ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తుందని అన్నారు. విదేశీ విద్యా పథకం బలహీన వర్గాల చెందిన చాలా మంది విద్యార్థులకు విదేశాలలో విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. ఈ పథకం ఏపీలో ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం గణనీయమైన మార్పులు తీసుకువచ్చి స్కాలప్‌షిప్‌ల మొత్తాన్ని రూ.10 లక్షల నుంచి 20 లక్షల వరకు పెంచిందన్నారు. అదే విధంగా తల్లిదండ్రుల వార్షిక ఆదాయ పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచినట్లు చెప్పారు.

విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో పథకాలను చేపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ విద్యార్థుల చదువులపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని అన్నారు. విదేశాల్లో విద్యాభ్యాసం చేసే విద్యార్థులకే కాకుండా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి వరకు కూడా పూర్తిగా పాఠశాలలు తెరవలేదని, ఇటీవల కాలంలోనే పై తరగతుల విద్యార్థులకు మాత్రమే బోధన చేసేందుకు అనుమతించారని అన్నారు.

ఇవీ చదవండి :

Digilocker: మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ భద్రంగా దాచుకోండిలా.. ఒక్క యాప్‌తో ఎన్నో సదుపాయాలు

Jobs: హైదరాబాద్‌ సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఉద్యోగావకాశాలు.. ఎలా అప్లయ్‌ చేసుకోవాలి.. చివరి తేది ఎప్పుడు..