AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jobs: హైదరాబాద్‌ సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఉద్యోగావకాశాలు.. ఎలా అప్లయ్‌ చేసుకోవాలి.. చివరి తేది ఎప్పుడు..

Jobs In Security Printing Press Hyderabad: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్నారా.? అయితే ఈ అవకాశం మీకోసమే. హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌ ఇటీవల పలు ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వివిధ విభాగాల్లో..

Jobs: హైదరాబాద్‌ సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఉద్యోగావకాశాలు.. ఎలా అప్లయ్‌ చేసుకోవాలి.. చివరి తేది ఎప్పుడు..
Jobs In Spp
Narender Vaitla
|

Updated on: Mar 21, 2021 | 3:10 AM

Share

Jobs In Security Printing Press Hyderabad: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అవుతున్నారా.? అయితే ఈ అవకాశం మీకోసమే. హైదరాబాద్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌ ఇటీవల పలు ఖాళీలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 10 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకు గాను ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కూడా మొదలైంది. మార్చి 15న మొదలైన దరఖాస్తు ప్రక్రియను ఏప్రిల్‌ 10తో ముగించనున్నారు. అర్హత, ఆసక్తికలిగిన అభ్యర్థులు ఏప్రిల్‌ 10లోపు అప్లయ్‌ చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు https://spphyderabad.spmcil.com/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

భర్తీ చేయనున్న పోస్టులు..

* సూపర్‌ వైజర్‌ (ప్రింటింగ్‌)

* సూపర్‌ వైజర్‌ (టెక్నికల్‌ కంట్రోల్‌) –

* సూజర్‌ వైజర్‌ (ఐటీ)

* సూపర్‌ వైజర్‌ (ఓఎల్‌)

* జూనియర్‌ అసిస్టెంట్‌ (హిందీ)

ముఖ్యమైన విషయాలు..

* వివిధ పోస్టులకు విద్యా అర్హతకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

* ఇక ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవాలనుకునే అభ్యర్థులు 18 నుంచి 30 ఏళ్ల వయసు వారై ఉండాలి.

* ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు రూ.26 వేల నుంచి రూ. లక్ష వరకు వేతనం ఉంటుంది.

* జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు 18 నుంచి 28 ఏళ్ల వయసు ఉండాలి. వీరికి నెలకు రూ.8,350 నుంచి రూ.20,470 వేతనంగా అందిస్తారు.

ఎలా అప్లయ్‌ చేసుకోవాలి…

* ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ https://spphyderabad.spmcil.com/లోకి వెళ్లాలి.

* అనంతరం ‘కెరీర్స్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత అందులో ఉన్న ‘Click Here To Apply’పై నొక్కాలి.

* వెంటనే ఒక కొత్త పేజీ ఓపెన్‌ అవుతంది. అందులో పేర్కొన్న అన్ని అంశాలను ఎంటర్‌ చేసి.. చివరికి పరీక్ష ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

Also Read: Work From Home: మాకొద్దీ వర్క్‌ ఫ్రమ్‌ హోం.. ఆఫీసుకు వెళ్లడానికే మెజారిటీ మొగ్గు.. సర్వేలో ఆసక్తికర విషయాలు..

Corona Effect On OU Exams: ఓయూలో కరోనా కలకలం.. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్‌.. ఈరోజు జరిగే పరీక్షలు..

GATE 2021 Result Declared: గేట్‌ 2021 ఫలితాలు విడుదల చేసిన ఐఐటీ ముంబయి… ఇలా చెక్‌ చేసుకోండి..