Admissions: కరీంనగర్ ప్రభుత్వ బధిరుల పాఠశాలలో 2023-24 ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ ప్రభుత్వ బధిరుల (మూగ, చెవిటి) ఆశ్రమ పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ నాగలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లిస్ మీడియంలో ప్రవేశాలు..
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ ప్రభుత్వ బధిరుల (మూగ, చెవిటి) ఆశ్రమ పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ నాగలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లిస్ మీడియంలో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో ప్రవేశాలకు బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల పరిధిలోని విద్యార్థులు అర్హులని ఆమె పేర్కొన్నారు.
ప్రవేశాలకు సంబంధించి ఇతర సందేహాలకు 90002 21301, 96668 68755 నంబర్లకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విద్యాసంవత్సరంలో గురుకుల విద్యలయాలు, జూనియర్ కాలేజీలు, ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలకు విద్యాశాఖ ఇప్పటికే కార్యచరణ ప్రారంభించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.