JEE Main 2024 Final Answer key: రేపు జేఈఈ మెయిన్‌ (సెషన్‌2) ఫలితాలు విడుదల? వెబ్‌సైట్లో ఫైనల్‌ ఆన్సర్‌ ‘కీ’

జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌ 2 పరీక్షల ఫైనల్‌ ఆన్సర్ ‘కీ’ విడుదలైంది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది. పరీక్షలు రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఆన్సర్‌ 'కీ' డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌ 2 పరీక్షలు ఏప్రిల్‌ 4 నుంచి 12వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 319 నగరాల్లో, దేశం వెలుపల 22 నగరాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 12.57 లక్షల మంది..

JEE Main 2024 Final Answer key: రేపు జేఈఈ మెయిన్‌ (సెషన్‌2) ఫలితాలు విడుదల? వెబ్‌సైట్లో ఫైనల్‌ ఆన్సర్‌ 'కీ'
JEE Main 2024 Final Answer key
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 23, 2024 | 6:53 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌ 2 పరీక్షల ఫైనల్‌ ఆన్సర్ ‘కీ’ విడుదలైంది. ఈ మేరకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది. పరీక్షలు రాసిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి ఆన్సర్‌ ‘కీ’ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌ 2 పరీక్షలు ఏప్రిల్‌ 4 నుంచి 12వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 319 నగరాల్లో, దేశం వెలుపల 22 నగరాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 12.57 లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన మొదటి సెషన్‌ తోపాటు రెండో సెషన్‌కు హాజరైన విద్యార్థులు సాధించిన స్కోరుల్లో మెరుగైన దానిని పరిగణనలోకి తీసుకొని మెరిట్‌లిస్ట్‌ను తయారు చేస్తారు. ఈ మేరకు ర్యాంకులను ఎన్టీఏ (NTA) ప్రకటిస్తుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 25న జేఈఈ సెషన్‌ 2 ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. అయితే అంతకన్నా ముందే విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్ధులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి తమ స్కోరు కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

జేఈఈ మెయిన్‌ రెండు విడతల్లో నిర్ణీత కటాఫ్‌ మార్కులు సాధించిన తొలి 2.50 లక్షల మందిని మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హులు. ఈ పరీక్ష రాసేందుకు ఆసక్తి కలిగిన వారు ఏప్రిల్‌ 27 నుంచి దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు మే 7వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. మే 17 నుంచి 26 వరకు అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 పరీక్ష జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌ 1 పరీక్ష జరుగుతుంది. ఇక పేపర్‌ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు జూన్‌ 9వ తేదీన ప్రకటిస్తారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చే ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఐఐటీల్లో, ఎన్‌ఐటీలు, రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. కొన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా జేఈఈ ర్యాంకును పరిగణనలోకి తీసుకుంటారు. 2024లో నిర్వహించిన జేఈఈ మెయిన్‌ రెండు సెషన్‌లకు కలిపి దేశ వ్యాప్తంగా దాదాపు 24 లక్షల మందికిపైగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.