JEE Main Result 2021: మళ్లీ నిరాశే.. స్పష్టమైన ప్రకటన చేయని ఎన్టీఏ.. జేఈఈ ఫలితాలు మరింత ఆలస్యం..!
NTA JEE Main result 2021: జేఈఈ 2021 (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021) పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. ఎన్టీఏ విడుదల చేసిన సర్క్యూలర్ ప్రకారం.. అభ్యర్థులందరూ ఈ రోజు ఫలితాలను..
NTA JEE Main result 2021: జేఈఈ 2021 (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021) పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. ఎన్టీఏ విడుదల చేసిన సర్క్యూలర్ ప్రకారం.. అభ్యర్థులందరూ ఈ రోజు ఫలితాలను విడుదల చేస్తారని ఊహించారు. కానీ ఆదివారం (మార్చి 7) విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు ఇంకా వస్తాయేమో అంటూ అభ్యర్థులంతా ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఈ నిరీక్షణ అర్థరాత్రి వరకూ కొనసాగనుంది. ఈ మేరకు పరీక్షరాసిన అభ్యర్థులు జేఈఈ ఫలితాలను ఎప్పుడు ప్రకటిస్తారని.. తాము నిరీక్షిస్తున్నామంటూ ట్విట్ చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులు.. ఈ నిరీక్షణ అర్థరాత్రి వరకూ కొనసాగుతుందా.? అంటూ మరికొందరు పరీక్ష ఫలితాలను విడుదల చేయాలంటూ కేంద్ర మంత్రిని కోరుతున్నారు.
జేఈఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో మార్చి 7, 2021 న చెక్ చేసుకోవాలని ఎన్టీఏ, కేంద్రమంత్రి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్‌టిఏ నిర్వహించిన జేఈఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఎన్‌టిఎ స్కోరు లేదా పర్సంటైల్ ర్యాంక్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేస్తుంది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్ nta.ac.in లో పరీక్షల ఫలితాలను వెల్లడించనుంది.
ఇలా ఉండగా, జేఈఈ -2021 విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జేఈఈ-2021 నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. కరోనా నేపథ్యంలో పరీక్షలో కీలక మార్పులు చేశారు. ప్రశ్నపత్రాల్లో ఆప్షన్లను పెంచడంతోపాటు మాతృభాషలో రాసుకునే అవకాశం కల్పించారు. అలాగే.. నెగెటివ్ మార్కులను తొలగించారు. ఈసారి జేఈఈని ఇంగ్లీష్, హిందీతో పాటు మరో 11 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించారు.
Also Read: