JEE Main Result 2021: జేఈఈ మెయిన్ 2021 రిజల్ట్స్ ఇవాళే
జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021), ఫిబ్రవరి పరీక్షకు సంబంధించిన ఫలితాలు బహుశా ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో
జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2021), ఫిబ్రవరి పరీక్షకు సంబంధించిన ఫలితాలు బహుశా ఇవాళ విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో మార్చి 7, 2021 న చెక్ చేసుకోవాలని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్‌టిఎ ఫిబ్రవరి పరీక్షలో హాజరైన అభ్యర్థులకు ఎన్‌టిఎ స్కోరు లేదా పర్సంటైల్ ర్యాంక్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేస్తుంది. అలాగే, అధికారిక వెబ్‌సైట్ nta.ac.in లో నవీకరించబడిన గత పరీక్షల క్యాలెండర్ ప్రకారం ఫలితాల తేదీలను కూడా అభ్యర్థులు గమనించవచ్చు. ఇక, ఇవాళ పేపర్ 1 ఫలితాలు మాత్రమే విడుదల కానున్నాయి.
ఇలా ఉండగా, జేఈఈ -2021 విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో జేఈఈ-2021 నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. కరోనా నేపథ్యంలో పరీక్షలో కీలక మార్పులు చేశారు. ప్రశ్నపత్రాల్లో ఆప్షన్లను పెంచడంతోపాటు మాతృభాషలో రాసుకునే అవకాశం కల్పించారు. అలాగే.. నెగెటివ్ మార్కులను తొలగించారు. ఈసారి జేఈఈని ఇంగ్లీష్, హిందీతో పాటు మరో 11 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించారు. ఇందులో తెలుగు, ఉర్దూ, తమిళం, మలయాళం, పంజాబి, ఒడి యా, కన్నడ, మరాఠి, గుజరాతి, బెంగాలి, అస్సామి ఉన్నాయి.
ఇప్పటివరకూ జేఈఈ పరీక్షను రెండుసార్లు నిర్వహించేవారు. ఈసారి మాత్రం నాలుగుసార్లు నిర్వహించాలని తలపెట్టారు. మొదటిసారి పరీక్షలో ఏమైనా పొరపాట్లు జరిగిన వారికి, ఇతర బోర్డుల పరీక్షల కారణంగా రాయలేనివారికి మరోసారి రాసుకునేందుకు అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ తెలిపింది. ఎవరైనా అభ్యర్థి నాలుగు సార్లూ పరీక్షలకు హాజరైతే ఎందులో ఎక్కువ మార్కు లు వస్తే దాన్ని పరిగణనలోనికి తీసుకుంటామని ఎన్టీఏ పేర్కొంది.