Bengal Polls: రసవత్తరంగా బెంగాల్ దంగల్.. ఎన్నికల ప్రచారం నగార మోగించనున్న ప్రధాని మోదీ
PM Modi Mega Rally: హ్యాట్రిక్కోసం దీదీ.. రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ .. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్-వామపక్షాల హోరాహోరీ పోరుతో బంగాల్ రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రతి పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న బెంగాల్ దంగల్‌ను యావత్ దేశం ఆసక్తిగా చూస్తోంది.
Bengal Elections: బెంగాల్ దంగల్ మొదలైంది. కుర్చీ కోసం కొట్లాటకు ప్రధాన పార్టీలు పోటీకి సై అంటున్నాయి. ఒకరి కంటే మరొకరు ప్రచార హోరు పెంచుతున్నారు. మాటల తూటలను దించుతున్నారు. ఇదే ఇప్పుడు దేశ వ్యాప్తంగా అదరిని ఆకర్శిస్తోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార భేరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత బంగాల్‌లో తొలిసారిగా ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ మైదానంలో నిర్వహించే బీజేపీ ప్రచార సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. బీజేపీ , తృణమూల్ కాంగ్రెస్ మధ్య విమర్శల యుద్ధం హోరాహోరీగా సాగుతున్న సమయంలో ప్రధాని పాల్గొనబోయే తొలి ప్రచార సభపై అంతా ఫోకస్ పెట్టారు. మరో వైపు ఈ సభను విజయవంతం చేయాలని కమల శ్రేణులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతీలో ప్రజలు సభకు హాజరయ్యేలా భారీ ఏర్పాట్లు చేశాయి.
బీజేపీలోకి మిథున్ చక్రవర్తి…
ప్రధాని మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలు సైతం ఈ ర్యాలీకి హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి సభా వేదికపై కనిపించే అవకాశం ఉంది.
భాజపా ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా శనివారం రాత్రి మిథున్ చక్రవర్తితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీతో మిథున్ బీజేపీలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు సీపీఎంకు సన్నిహితంగా ఉన్న మిథున్.. అనంతరం టీఎంసీ తరపున రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. రాజకీయాల్లోంచి వైదొలిగే ఉద్దేశంతో అప్పుడు పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. బెంగాల్‌లో 8 దశల్లో శాసనసభ ఎన్నికలు జరగనుండగా.. అందులో తొలి దశ మార్చి 27న జరగనుంది.
ఇవి కూడా చదవండి
తెలంగాణ బడ్జెట్ లెక్కలు.. కార్యాచరణ మొదలు పెట్టనున్న ఆర్ధిక మంత్రి హరీశ్‌రావు