తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు, ఓ రాజ్యసభ స్థానం కూడా, డీఎంకే నిర్ణయం

తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు ఇవ్వాలని డీఎంకే నిర్ణయించింది. అలాగే ఓ రాజ్యసభ స్థానాన్ని కూడా ఇవ్వాలని తీర్మానించింది. తమకు 30 సీట్లు కావాలని కాంగ్రెస్ కోరగా 24 మాత్రమే కేటాయిస్తామని డీఎంకే స్పష్టం చేసింది.

  • Umakanth Rao
  • Publish Date - 10:31 am, Sun, 7 March 21
తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు, ఓ రాజ్యసభ స్థానం కూడా, డీఎంకే నిర్ణయం

తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లు ఇవ్వాలని డీఎంకే నిర్ణయించింది. అలాగే ఓ రాజ్యసభ స్థానాన్ని కూడా ఇవ్వాలని తీర్మానించింది. తమకు 30 సీట్లు కావాలని కాంగ్రెస్ కోరగా 24 మాత్రమే కేటాయిస్తామని డీఎంకే స్పష్టం చేసింది. చివరకు ‘బేరం’ 20  వద్ద కుదిరింది. ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకత్వం..చెన్నైలోని డీఎంకే నేతలతో మాట్లాడి తుదకు ఈ డీల్ కుదుర్చుకుంది. డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ ని తాము కలిశామని, ఒప్పందం ఆదివారం కుదురుతుందని పార్టీ నేత దినేష్ గుండూరావు చెప్పారు. ఇక సీట్ల సర్దుబాటు విషయంలో  డీఎంకే పార్టీయే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేత అళగిరి తెలిపారు. 2016 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ కి 41 సీట్లు కేటాయించగా ఏడు స్థానాల్లో మాత్రం పార్టీ గెలిచింది. అటు డీఎంకే నుంచి తాము కోరిన సీట్లలో దిగివచ్చామన్న అభిప్రాయాన్ని అళగిరి తిరస్కరించారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ..తాజాగా మూడు సీట్లను ముస్లిం లీగ్ యూనియన్ కి, రెండింటిని మణితనేయ మక్కల్ కచ్చి కి కేటాయించింది. బీజేపీకి అన్నాడీఎంకే 20 స్థానాలను కేటాయించిన విషయం  తెలిసిందే.

ఇక నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది  మయ్యం కూడా రంగంలో ఉండడంతో పోటీ ఉత్కంఠగా ఉంటుందని అంటున్నారు. ఏప్రిల్ 6 న ఒకే దశలో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఏమైనా ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకే మధ్యే ఉండనుంది. కాగా…  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే తమిళనాడులో పలు మార్లు పర్యటించారు. తమిళ సంస్కృతి, భాష పట్ల ఆయన  ప్రత్యేకంగా ప్రస్తావించారు. తద్వారా తమిళుల ఆదరాభిమానాలను పొందేందుకు యత్నించారు. బీజేపీకి సంబంధించి కేంద్ర నాయకుల్లో అమిత్ షా  తప్ప మిగిలినవారు ఈ రాష్ట్రాన్ని విజిట్ చేయనప్పటికీ ఇక్కడ తమ ఉనికిని చాటుకునేందుకు ఈ పార్టీ యత్నిస్తోంది. హోమ్ మంత్రి అమిత్ షా ఆదివారం తమిళనాడు, కేరళ రాష్ట్రాలను సందర్శించనున్నారు. ఇక డీఎంకే మళ్ళీ రాష్ట్రంలో అధికార పగ్గాలను చేపట్టేందుకు  ఉవ్విళ్లూరుతోంది.

 

మరిన్ని ఇక్కడ చదవండి:

Vikarabad stabbing : వికారాబాద్ లో ఆదివారం ఉదయంపూట కలకలం, పాండు గౌడ్ ను కత్తితో పోట్లుపొడిచిన నవీన్ గౌడ్

Airindia Flight Troubles: గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ దగ్గర దట్టంగా పొగమంచు…గంట నుంచి గాల్లో చక్కర్లు కొడుతున్న ఎయిరిండియా విమానం