మీ సమస్యలు పరిష్కరించని అధికారులను కర్రలతో కొట్టండి, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాని అధికారులను కర్రలతో కొట్టాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు.. బీహార్ లోని బెగుసరాయ్ లో శనివారం  జరిగిన ఓ సభలో మాట్లాడిన ఆయన..

  • Updated On - 11:03 am, Sun, 7 March 21 Edited By: Anil kumar poka
మీ సమస్యలు పరిష్కరించని అధికారులను కర్రలతో కొట్టండి, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాని అధికారులను కర్రలతో కొట్టాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపునిచ్చారు.. బీహార్ లోని బెగుసరాయ్ లో శనివారం  జరిగిన ఓ సభలో మాట్లాడిన ఆయన.. అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గానీ ఎవరైనా ప్రజలకు సేవ చేయడానికే తమ బాధ్యతగా నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు.  ఈ బాధ్యతను విస్మరించి ఎవరైనా మితిమీరి ప్రవర్తిస్తే వారిని కర్రలతో కొట్టాలని  ఆవేశంగా అన్నారు. అనేకమంది తన వద్దకు వచ్చి ముఖ్యంగా అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రస్తావిస్తున్నారని గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడంలేదని, విన్నవించడానికి వస్తే విసుక్కుంటున్నారని పలువురు ఫిర్యాదు చేశారన్నారు. ఈ విధమైన పోకడను తాను సహించబోమన్నారు.

చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం మీరు నావద్దకు ఎందుకు వస్తారని తాను ప్రశ్నించేవాడినని, ఇంతమంది ఎంపీలు,  ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారని, వీరు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే ఇంకా సమస్య ఏముంటుందని ఆయన అన్నారు. మీ ఇబ్బందులు పరిష్కరించకపోతే రెండు చేతుల్లో కర్ర పట్టుకుని తల మీద ఒక్కటేయండి అని ఆయన ఆవేశంగా వ్యాఖ్యానించారు. అప్పుడు కూడా వినకపోతే మీ వెనుక ఈ గిరిరాజ్ సింగ్ ఉంటాడు అని ఆయన అనగానే ప్రజలు హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారు..గతంలో కూడా ఈయన కొన్ని వ్యాఖ్యలు  పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినప్పుడు సైతం ఆయన ఈ విధమైన వ్యాఖ్యలే చేశారు. పాకిస్థాన్, ఇండియా, ముస్లిమ్స్ అంటూ లోగడ గిరిరాజ్  సింగ్ చేసిన వ్యాఖ్యలతో హోమ్ మంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఈయనను పిలిచి దాదాపు మందలించినత పని చేశారు. ఈ విధమైన కామెంట్లు పార్టీకి చేటు తెస్తాయని హెచ్చరించారు.  అయినా గిరిరాజ్ సింగ్ తన వైఖరిని వీడలేదు. ఇప్పుడు అధికారులను కర్రలతో కొట్టాలని గిరిరాజ్ సింగ్ ఇఛ్చిన సూచన కూడా పార్టీని గందరగోళంలో నెట్టేట్టు కనిపిస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

Petrol Price Today: పెట్రో పరుగులకు స్మాల్ బ్రేక్.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోలు, డీజీల్ ధరలు ఇలా ఉన్నాయి..

Telangana Corona: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 158.. దేశంలో కూడా ప్రమాదకరంగా కేసులు