ISRO VSSC Jobs 2025: పదో తరగతి అర్హతతో విక్రమ్ సారాభాయ్ స్పెస్ సెంటర్‌లో ఉద్యోగాలు.. నిరుద్యోగులకు భలే ఛాన్స్!
Vikram Sarabhai Space Centre Jobs 2025: భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కు చెందిన ప్రధాన కేంద్రమైన తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పెస్ సెంటర్ (VSSC).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు..

ఇస్రోకు చెందిన ప్రధాన కేంద్రమైన తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పెస్ సెంటర్ (VSSC).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 2 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 64 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులన్నింటినీ కేవలం పదో తరగతి, ఐటీఐ అర్హతతో మాత్రమే భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు ఇవే..
- ఫిట్టర్ విభాగంలో ఖాళీల సంఖ్య: 20
- ఎలక్ట్రానిక్ మెకానిక్ విభాగంలో ఖాళీల సంఖ్య: 11
- టర్నర్ విభాగంలో ఖాళీల సంఖ్య: 06
- మెషినిస్ట్ విభాగంలో ఖాళీల సంఖ్య: 05
- ఎలక్ట్రీషియన్ విభాగంలో ఖాళీల సంఖ్య: 05
- ఎలక్ట్రోప్లేటర్ విభాగంలో ఖాళీల సంఖ్య: 03
- వెల్డర్ విభాగంలో ఖాళీల సంఖ్య: 02
- ఎంఆర్&ఏసీ విభాగంలో ఖాళీల సంఖ్య: 01
- మెకనిక్(మోటర్ వెహికిల్/డీసిల్) విభాగంలో ఖాళీల సంఖ్య: 01
- ఫోటోగ్రఫి విభాగంలో ఖాళీల సంఖ్య: 01
- కార్పెంటర్ విభాగంలో ఖాళీల సంఖ్య: 01
- మెకానికల్ విభాగంలో ఖాళీల సంఖ్య: 07
- ఫార్మసిస్ట్-ఏ విభాగంలో ఖాళీల సంఖ్య: 01
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, డిప్లొమా (ఫార్మసీ), ఐటీఐ కోర్సుల్లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి కింద అభ్యర్ధులకు తప్పనిసరిగా జూన్ 16, 2025 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 2, 2025వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీగా జూన్ 16, 2025గా నిర్ణయించారు. తుది గడువులోపు నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు టెక్నీషియన్-బీ పోస్టులకు రూ.37,000, మెకానికల్ పోస్టులకు రూ.37,000, ఫార్మసిస్ట్-ఏ పోస్టుకు రూ.50,000 చొప్పున జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
విక్రమ్ సారాభాయ్ స్పెస్ సెంటర్ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.








