AP DSC 2025 SA Exam Schedule: మెగా డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్ చూశారా?
రాష్ట్రంలో కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా జారీ చేసింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దరఖాస్తు చేసుకున్నారు. ఇక డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు..

అమరావతి, జూన్ 2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు కూడా జారీ చేసింది. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దరఖాస్తు చేసుకున్నారు. డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు జూన్ 6 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలకు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో మొత్తం 150 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
అయితే ఈ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ (SA) కొలువులకు అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,10,010 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక స్కూల్ అసిస్టెంట్ (SA) పరీక్షలు జూన్ 8 నుంచి ప్రారంభం కానున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పరక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఎగ్జామినేషన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ కేటగిరీలో అన్ని సబ్జెక్టులకు కలిపి మొత్తం 7,487 పోస్టులు ఉన్నాయి. ఏ సబ్జెట్ పరీక్ష ఏ తేదీన జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
మెగా డీఎస్సీ 2025 ఎస్‌ఏ పరీక్షల తేదీలివే..
- జూన్ 8న ఎస్‌ఏ-హిందీ (లాంగ్వేజ్), కన్నడ (లాంగ్వేజ్), ఒరియా (లాంగ్వేజ్), తమిళ్ (లాంగ్వేజ్) పరీక్షలు
- జూన్ 9న ఎస్‌ఏ-ఫిజికల్ ఎడ్యుకేషన్ (నాన్ లాంగ్వేజ్), ఫిజికల్ సైన్స్ (నాన్ లాంగ్వేజ్), ఫిజికల్ సైన్స్ (కన్నడ, ఒరియా, తమిళ్, ఉర్దూ మీడియం) పరీక్షలు
- జూన్ 10న ఎస్‌ఏ-బయోలాజికల్ సైన్స్ (నాన్ లాంగ్వేజ్), బయోలాజికల్ సైన్స్ (కన్నడ, ఒరియా, తమిళ్, ఉర్దూ మీడియం) పరీక్షలు
- జూన్ 12న ఎస్‌ఏ-మ్యాథ్స్, ఎస్‌ఏ-మ్యాథ్స్ (కన్నడ, ఒరియా, తమిళ్, ఉర్దూ మీడియం) పరీక్షలు
- జూన్ 13న ఎస్‌ఏ-ఇంగ్లీష్ (లాంగ్వేజ్) పరీక్షలు
- జూన్ 16న ఎస్‌ఏ-సోషల్ స్టడీస్ (నాన్ లాంగ్వేజ్) పరీక్షలు
- జూన్ 17న ఎస్‌ఏ-సోషల్ స్టడీస్ (కన్నడ, ఒరియా, తమిళ్, ఉర్దూ మీడియం) పరీక్షలు
- జూన్ 29, 30 తేదీల్లో ఎస్‌ఏ-తెలుగు (లాంగ్వేజ్) పరీక్షలు
ఏపీ మెగా డీఎస్సీ 2025 స్కూల్ అసిస్టెంట్ పరీక్షల పూర్తి షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




