AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG ICET 2025 Admit Cards: మరో వారంలో ఐసెట్ ప్రవేశ పరీక్ష.. అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!

తెలంగాణ ఐసెట్‌ 2025) పరీక్ష మరో వారం రోజుల్లో జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు ఉన్నత విద్యామండలి సోమవారం (జూన్‌ 2) విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలని..

TG ICET 2025 Admit Cards: మరో వారంలో ఐసెట్ ప్రవేశ పరీక్ష.. అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే!
Telangana ICET 2025 Exam
Srilakshmi C
|

Updated on: Jun 02, 2025 | 5:36 PM

Share

హైదరాబాద్‌, జూన్‌ 2: తెలంగాణ ఇంటిగ్రేటెడ్‌ కామన్ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఐసెట్‌ 2025) పరీక్ష మరో వారం రోజుల్లో జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులు ఉన్నత విద్యామండలి సోమవారం (జూన్‌ 2) విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి హాల్‌టికెట్స్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక ఐసెట్‌ పరీక్ష తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 8, 9 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇప్పటికే వెల్లడించింది కూడా.

తెలంగాణ ఐసెట్‌ 2025 హాల్‌ టికెట్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ప్రశాంతంగా ముగిసిన ఏపీ కానిస్టేబుల్‌ తుది రాత పరీక్ష.. ఫలితాలు ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం జూన్‌ 1న తుది రాతపరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 97.52 శాతం మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో అదే రోజు సాయంత్రం 5 గంటలకు పరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదల చేసింది. ఎవరికైనా అభ్యంతరాలుంటే జూన్‌ 4 సాయంత్రం 5 గంటల్లోగా slprbap.obj@gmail.com కు మెయిల్‌కు పంపించాలని పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ మీనా ఓ ప్రకటనలో అభ్యర్ధులకు సూచించారు.

ఇవి కూడా చదవండి

ఏపీ డీఎస్సీ 2025 ఎస్జీటీ పరీక్ష తేదీలివే.. జూన్‌ 13 నుంచి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఏపీ మెగా డీఎస్సీ 2025 ఎస్జీటీ పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూన్‌ 13, 17, 18, 19, 20, 21 తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. జూన్‌ 13, 17, 18 తేదీల్లో ఎస్జీటీ పరీక్షలు, జూన్‌ 19న ఎస్జీటీ, ఎస్జీటీ-హెచ్‌హెచ్‌, ఎస్జీటీ-వీహెచ్‌ పరీక్షలు, జూన్‌ 20న ఎస్జీటీ పరీక్ష, 21న ఎస్జీటీ ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళ్‌ మీడియం పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.

ఏపీ డీఎస్సీ 2025 ఎస్జీటీ పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..