IRDAI Hyderabad Jobs 2023: హైదరాబాద్‌లోని ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగావకాశాలు.. ఏయే అర్హతలుండాలంటే..
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ).. 45 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల..
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ).. 45 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆక్యురియల్, ఫైనాన్స్, లా, ఐటీ, రిసెర్చ్, జనరలిస్ట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్/ బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో మే 10, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా రూ.750లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ పరీక్ష, డిస్క్రిప్టివ్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.45,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
రాత పరీక్ష విధానం..
మొత్తం 160 మార్కులకుగాను 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 90 నిమిషాల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. రీజనింగ్, ఇంగ్లిస్ ల్యాంగ్వేజి, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. డిస్క్రిప్టివ్ పరీక్షలో భాగంగా ఇంగ్లిష్, ఎకనామిక్, సోషల్, ఇన్సూరెన్స్‌మేనేజ్‌మెంట్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 100 మార్కులు కేటాయిస్తారు. ప్రతిపేపర్‌కు 60 నిమిషాలు సమయం కేటాయిస్తారు.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.