IOP Recruitment: ఎంబీబీఎస్ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు… నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
IOP Recruitment: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినఇన్‌స్టిట్యూట్ ఆప్ ఫిజిక్స్(IOP) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో మెడికల్...
IOP Recruitment: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినఇన్‌స్టిట్యూట్ ఆప్ ఫిజిక్స్(IOP) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్ విధానంలో మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్న ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం…
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా పార్ట్ టైమ్ విధానంలో మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు కనీసం ఏడాది పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 65 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను estt@iopb.res.in మెయిల్ ఐడీకి పంపించాలి.
* అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్‌తో హాజరుకావాల్సి ఉంటుంది.
* ఎంపికైన వారికి నెలకు రూ. 50,000 జీతంగా చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 20-06-2022తో ముగియనుంది. ఇంటర్వ్యూలను 21-06-2022న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్, భువనేశ్వర్, ఒడిషాలో నిర్వహించనున్నారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..