AP Inter 2022: నేటి నుంచి ప్రారంభమైన ఏపీ ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు.. జులై 1 నుంచి తరగతులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022-23 విద్యా సంత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు ఈ రోజు (సోమవారం) నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది..

AP Inter First year admissions 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2022-23 విద్యా సంత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు ఈ రోజు (సోమవారం) నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇప్పటికే ప్రవేశాల షెడ్యూల్ కూడా ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జులై 20 నాటికి మొదటి విడత (AP Inter First Year admissions) ప్రవేశాలు ముగుస్తాయి. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లను చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. ఏపీలో కూడా జులై ఒకటి నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభంకానున్నాయి. ఫస్ట్ ఫేజ్‌లో మిగిలిపోయిన సీట్లను జనరల్ సీట్లుగా మార్పుచేసి ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది సెక్షన్‌కు 88 మంది విద్యార్ధుల చొప్పున సీట్లు ఇవ్వనున్నారు.
వొకేషనల్, పారామెడికల్ కోర్సులకు మాత్రం సెక్షన్‌కు 30 మందిని మాత్రమే కేటాయించనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు నోటిఫికేషన్‌లో పేర్కొంది. రెండేళ్ల సాధారణ ఇంటర్మీడియట్‌తో పాటు ఒకేషనల్ కోర్సుల్లో కూడా విద్యార్ధులకు ప్రవేశాలు కల్పించనున్నారు. జులై 1 నుంచి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్ధులందరికీ తరగతులు ప్రారంభమవుతాయి. ఐతే ఇంటర్ ప్రవేశాల కోసం ఎలాంటి ప్రవేశపరీక్షలు నిర్వహించరాదని, ఒకవేళ ఏ కాలేజీ అయిన పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఇంటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది.




మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.