CUET PG 2022: సీయూఈటీ పీజీ 2022 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఎప్పటివరకంటే..
2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష (CUET PG 2022)కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని ఎన్టీఏ పొడిగించింది..
CUET PG 2022 application last date: 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష (CUET PG 2022)కు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని ఎన్టీఏ పొడిగించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు ప్రక్రియ మే 19న ప్రారంభమై జూన్ 18వ తేదీతో ముగుస్తుంది. ఐతే తాజా ప్రకటనతో జులై 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిచ్చింది. జులై 5 వరకు దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్ cuet.nta.nic.in లేదా uet.samarth.ac.in.లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం జులై 6 నుంచి 8వ తేదీ వరకు దరఖాస్తుల్లో ఏవైనా వివరాలను తప్పుగా నమోదు చేసుకుని ఉంటే సవరించు కోవడానికి అవకాశం ఉంటుంది. ఇక సీయూఈటీ పీజీ టెస్ట్ 2022 జులై చివరి వారంలో, ఆన్‌లైన్ విధానంలో జరుగుతుందని ఎన్టీఏ ప్రకటించినా.. పరీక్ష తేదీని మాత్రం ఇంతవరకు విడుదల చేయలేదు.
యూజీసీ ఈ ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా ఉన్న 45 సెంట్రల్ యూనివర్సిటీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష విధానాన్ని ప్రవేశపెట్టింది. క్వశ్చన్ పేపర్ హిందీ లేదా ఇంగ్లీష్ ల్యాంగ్వేజుల్లో మాత్రమే ఉంటుంది. ఇతర అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలని ఈ సందర్భంగా ఎన్టీఏ తెల్పింది. సందేహాల నివృతి కోసం 011 4075 9000 హెల్ప్ డెస్క్‌కి కాల్ చేయవచ్చు లేదా cuet-pg@nta.ac.in ఈమెయిల్ ద్వారా తెలియజేయవచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.